300 మంది పలు ముఠాలుగా విడిపోయిన తీవ్రంగా కోట్టకోవడంతో కంగారు పడిన మున్సిపల్ కమీషనర్.. పోలీసులకు ఫోన్ చేశారు. తక్షణం రావాలని కోరారు. అంతేకాదు ఆయన మున్సిఫల్ కార్యాలయంలోకి వెళ్లి, ఎవ్వరూ తన వద్దకు రాకుండా అటెండర్ ను పురమాయించారు. 300 మంది కోట్టుకోవడమంటే ఏదో పెద్ద గొడవే జరుగుతుందని ఊహించిన పోలీసులకు.. వారి వద్ద మారణాయుధాలు ఏమైనా వున్నాయా, కర్రలు, రాడ్లు లాంటివేమైనా వున్నాయా అని అరా తీశారు. అంతే అప్పుటి వరకు పోలీసులందరిని సిద్దంగా వుండాలని ఆదేశించిన ఉన్నతాధికారులు.. ఇక మహాళా పోలీసులను సిద్దం కమ్మని చెప్పా.. కొందరు మగ పోలీసులతో కలసి గొడవ జరుగుతున్న మున్సిఫల్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడకు చేరుకోగానే మున్సిఫల్ కమీషనర్ అందించిన సమాచారం కరెక్టే ననుకుని.. అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో పోలీసులు తమ వారిని అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో అక్కడికి వచ్చిన వారితో మీ భార్యేనా..? ఎందుకు అంతలా కోట్టింది. గమ్మునుండమంటే కూడా ఉండటం లేదు. అవతలి వాళ్లు మనుషులు కాదనుకుంటోందా అంటూ పోలీసులు ప్రశ్నించారు. ఇప్పుడు మీకు కూడా విషయమం అర్థమైందనుకుంటా.. కోట్టుకోవడం చేసింది పురుష పుంగములు కాదు. వారి ఆకాశంలో సగం అంటే సరిపోతుందా.? మీకులా మేమూ తన్నుకోలేమా, గోడవ పడలేమా..? ఠాణాలకు వెళ్లలేమా..? అన్నట్లు సాగిన ఈ ఘర్షణలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
డ్వాక్రా మహిళల మధ్య చిచ్చు రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. మామూలుగా కాదు, జుట్టు జుట్టు పట్టుకుని వీరంగం సృష్టించారు. డ్వాక్రా సంఘాలకు చెందిన మొత్తం 1.80 లక్షల రూపాయల సొమ్మును కొంతమంది స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో 80 వేలను తిరిగి కట్టేశారు. మరో లక్ష రూపాయలు ఇంకా అలాగే ఉంది. డబ్బులు పక్కదోవ పడుతున్నాయంటూ కొంతమంది కలిసి ఓ గ్రూపు నాయకురాలిపై ఆరోపణలు చేశారు. దీనిపై కార్యవర్గ సభ్యులకు తెలియకుండానే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతా కలిసి సమావేశం ఏర్పాటుచేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.
దాంతో 28 డ్వాక్రా సంఘాలకు చెందిన దాదాపు 300 మంది మహిళలు ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అది కాస్తా.. ఘర్షణకు దారితీసింది. మునిసిపల్ కమిషనర్ చూస్తుండగానే ఆయన సాక్షిగా కొట్టుకున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. విపరీతంగా జుట్లు పట్టుకుని, పిడిగుద్దులు కురిపిస్తూ కుమ్ములాడుకున్నారు. దీంతో కమిషనర్ తన కార్యాలయంలోకి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వన్ టౌన్ పోలీసులు వచ్చి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more