Nhrc notice to telangana government on farmers suicides

telangna farmers suicide, telangna farmers problems, telangna farmers suicide issue in assembly, kcr on telangna farmers suicide, telangana problems and solutions, farmers problems in telangana, farmers problems in india, national human rights commission, latest news updates

nhrc notice to telangana government on farmers suicide : national human rights commission gives notice to telangana government on farmers suicide issue orders to give reply in 15days

రైతు ఆత్మహత్యలపై సమాధానం ఇవ్వండి

Posted: 11/26/2014 06:55 PM IST
Nhrc notice to telangana government on farmers suicides

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. వాటిపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంట పొలాల్లో సాగుతున్న మరణ మృదంగంపై మీడియాలో ప్రసారమైన కథనాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వచ్ఛందంగా స్పందించింది. రైతుల ఆత్మహత్యల అంశాన్ని సుమోటోగా విచారణకు చేపట్టింది. ‘‘వర్షాలు కురవక పోవడం, పంటలు పండకపోవడం, వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు... ఇదో విష వలయం. ఇందులో వేలాది రైతులు చిక్కుకున్నారు.

దీని నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే మార్గమని రైతులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఆ తర్వాత కేవలం బ్యాంకు రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని 2014 ఆగస్టు 13న ఆదేశాలు జారీ చేయడంతో రైతులు నిస్పృహకు గురైనట్లు సమాచారం ఉంది. ఇదే నిజమైతే... రైతులకు సంబంధించి తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని మానవ హక్కుల సంఘం పేర్కొంది. దీనిపై రెండు వారాల్లోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మకు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 76 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక మీడియాలో వచ్చిన కథనాన్ని మానవ హక్కుల సంఘం పరిగణనలోకి తీసుకుంది. విత్తనానికి నీళ్లు కావాలి! చిగుళ్లు వచ్చినప్పుడు బలం వేయాలి! మొక్కదశలో తెగుళ్లను చంపాలి! ఇదంతా అయి...పంట దిగుబడి వచ్చి మార్కెట్‌కు వెళ్లి.. అమ్మకాలు కావాలి ఇందులో ఎక్కడ తేడా జరిగినా ఊపిరి నిలవదు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతుల ఉపిరి అగిపోతోందని మీడియా కథనాలనుప్రసారం చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమీషన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  farmers suicide  nhrc  latet news  

Other Articles