Telangana winter session assembly meetings sine die

telangana assembly, winter session, budget sessions, assembly meetings, sine die, Chief Minister KCR, oppsition parties

telangana winter session assembly meetings sine die

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

Posted: 11/29/2014 05:35 PM IST
Telangana winter session assembly meetings sine die

తెలంగాణ శాసనసభ శీతాకాల బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో నిరవధిక వాయిదా పడ్డాయి. తెలంగాణ శాసనసభ సమావేశాలు సజావుగా జరిగాయని స్పీకర్ మధుసూదనా చారీ వెల్లడించారు. ఇవాళ తన చాంబర్లో మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 88 గంట 16 నిమిషాలపాటు 19 రోజులు సమావేశాలు జరిగాయన్నారు. ప్రభుత్వం స్టార్, అన్ స్టార్, సప్లిమెంటరీ మొత్తం  277 ప్రశ్నలకు సమాధానం చెప్పిందని.. 123 స్టార్, 50 అన్ స్టార్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.  కాలింగ్ అటెన్షన్పై మూడు ప్రకటనలు చేసింది. 104 సప్లిమెంటరీలకు సమాధానం ఇచ్చింది. రూల్ 344 కింద మూడు ప్రకటనలు చేసిందని తెలిపారు. సభలో ముగ్గురు మంత్రులు ప్రకటనలు చేశారు. ఆయా ప్రభుత్వ తీర్మానాలు, మూడు బిల్లులు ఆమోదించారు. రెండు అంశాలపై లఘు చర్చ జరిగింది. సభలో 117 మంది సభ్యులు మాట్లాడారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి కోత్త ప్రభుత్వం కాబట్టే శాసనసభలో మద్దతిచ్చామని.. అదే విధంగా ఆత్మవిమర్శ కూడా చేసుకునేందుకు సహకరించామని ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం కోన్ని హామీలను నేరవేర్చలేదని, భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫిరాయింపులను కొనసాగించవద్దని కోరుతున్నామన్నారు. కాగా టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభ మొత్తం టీఆర్ఎస్ ప్లీనరీలా జరిగిందని మండిపడ్డారు. కేసీఆర్ భజన చేసేందుకు వంద మంది మాగధులు పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు. తెలంగాన సర్కరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపభూయిష్టంగా వుందని, ఇలాంటి బడ్జెట్ ను తానెప్పుడూ చేడలేదని టీడీపీ విపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు సరిగా న్యాయం చేయలేని ప్రభుత్వం వారి పేరు చెప్పుకునే అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మరవరాదన్నారు. పేదలకు రావాల్సిన పింఛన్లు తగ్గిపోయాయని విమర్శించారు. విపక్ష సభ్యులను మాట్లాడనీయకుండా చేసి సభను నిర్వహించడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని ధ్వజమెత్తారు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles