Ferguson police officer darren wilson who killed black teen resigns from force

police officer, Darren Wilson, resignation, Ferguson, Missouri, police force, Michael Brown, criminal charges, St. Louis suburb, 120-mile (193-km) march, protest, grand jury's decision, indict

Ferguson police officer Darren Wilson, who killed black teen resigns from force

ఫెర్గూసన్ లో కాల్పులు జరిపిన అధికారి రాజీనామా..

Posted: 11/30/2014 08:10 PM IST
Ferguson police officer darren wilson who killed black teen resigns from force

అమెరికాలోని ఫెర్గూసన్‌లో ఆందోళనలకు, నిరననలు కారణమైన పోలీసు అధికారి డారెన్ విల్సన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సెయింట్ టూయిస్ సబ్అర్బ్ లో 14 ఏళ్ల బాలుడిని కాల్చిచంపినందుకు నైతిక బాధ్యత వహిస్తూ డారెన్ విల్సన్ రాజీనామా చేశారు. అమెరికాలో సుమారు 193 కిలోమీటర్ల మేర ఆందోళనకారులునిరసన చేపట్టనున్నారన్న సమాచారాన్ని తన తరపు న్యాయవాది ద్వారా తెలుసుకున్న ఆయన తన మూలంగానే ఆందోళనలు పెల్లుబిక్కుతున్నాయని రాజానామాకు పూనుకున్నారు.

నాలుగు నెలల క్రితం జరిగిన ఈ దాడిలో కాల్పులు జరిపిన పోలీసుల అధికారి డారిన్ విల్సన్ పై చర్యలు తీసుకోవడానికి కారణాలేంటని ప్రశ్నించిన గ్రాండ్ జ్యూరీ.. అధికారి తన విధులు తాను నిర్వర్తించాడని వెల్లడించింది. అధికారిని కాల్పుట ఘటనకు బాధ్యుడిని చేయలేమని చెప్పడంతో అమెరికాలో నల్లజాతీయులు ఆందోళన బాట పట్టారు. గత నెల రోజులుగా ఈ ఆందోళనలు మరింత శృతిమించాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా అందోళనకారులను శాంతించాల్సిందిగా విన్నవించారు.

అయినా ఆందోళనాకారులు శాంతించలేదు. తమ బిడ్డలను  అకారణంగా ఎందుకు మట్టుబెడుతున్నారంటూ నిరసనలు తెలుపుతూనే వున్నారు. నల్లజాతి అమెరికన్ల కొనుగోలు శక్తి ఏమిటో చూపిద్దామంటూ నిరసనకారులు చాలా చోట్ల అమ్మకాలను అడ్డుకున్నారు. బహిష్కరించారు. 'థ్యాంక్స్ గివింగ్ డే' ఎలాంటి గందరగోళాలు లేకుండా ముగిసినప్పటికీ...నల్లజాతి యువకుడు మైకేల్ బ్రౌన్ మృతికి కారకుడైన తెల్లజాతి అధికారి డారెన్ విల్సన్‌పై నేరారోపణ అవసరం లేదంటూ న్యాయనిర్ణేతలు తీసుకున్న నిర్ణయంతో మళ్లీ నిరసనలు చెలరేగాయి. తాజా నిరసనల్లో భాగంగా న్యూయార్క్‌లో సుమారు రెండువందల మంది ఆందోళనకారులు షాపింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. వీధుల వెంబడి వూరేగింపుగా వెళ్లారు. ఈ క్రమంలో అదుపుతప్పి వ్యవహరించిన ఏడుగురు ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, షికాగో, సియాటిల్, ఓక్లాండ్, కాలిఫోర్నియాల్లోని పలు నిరసన ప్రదర్శనలు జరిగాయి. సెయింట్ లూయిస్ లోని ప్రధాన మాల్స్ వద్ద భద్రతా సిబ్బందిని మోహరించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles