Supreme court pulls up bcci srinivasan claimed innocence

supreme court on bcci, supreme court on srinivasan, supreme court on spot fixing, supreme court latest news updats, n srinivasan on ipl spot fixing, srinivasan on dhoni in ipl fixing scam, srinivasan on bcci ipl enquiry, ipl spot fixing bcci allegations, gurnath meyappan, latest sports updates in telugu

supreme court pulls up bcci srinivasan claimed innocence : The Supreme Court on Saturday reacted sharply on the IPL scandal by asking the Board of Control for Cricket in India to give information with regards to the financial working model

క్రికెట్ వెనక కమర్షియల్ కోణాలు... ధోని -శ్రీని మద్య సంబంధమేంటి..?

Posted: 12/01/2014 05:43 PM IST
Supreme court pulls up bcci srinivasan claimed innocence

స్పాట్ ఫిక్సింగ్ బాగోతంతో దేశ క్రికెట్ చరిత్రకు కళంకం తెచ్చిన బీసీసీఐ, ఈ వ్యవహారంలో రోజుకో విధంగా వ్యవహరిస్తోంది. కేసు విచారణ సవ్యంగా సాగాలని చెప్తూనే కొన్ని నిజాలను దాచిపెడుతున్నట్లు స్పష్టం అవుతోంది. స్పాట్ ఫిక్సింగ్ నాటి బీసీసీఐ చైర్మన్, ప్రస్తుత ఐసీసీ చైర్ పర్సన్ శ్రీనివాసన్ మాటలు ఈ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. క్రికెట్ వెనక వ్యాపార సంబంధ కోణం దాగి ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆయన చేసిన కామెంట్లు వీటికి బలం చేకూరుస్తున్నాయి. ఐపీఎల్ స్కాం, ధోని ప్రమేయం - కెప్టెన్సి తొలగింపుపై ప్రశ్నించిన మీడియాపై శ్రీనివాసన్ గరకుగా మాట్లాడారు. ధోనిని వెనకేసుకొస్తూ స్పందించారు.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి చర్యల వల్ల క్రికెట్ వంటి జెంటిల్మెన్ గేమ్ ను బీసీసీఐ చంపేస్తోందని కోర్టు ఆక్షేపించింది. స్పాట్ ఫిక్సింగ్ పై సోమవారం జరిపిన విచారణ సందర్బంగా బోర్డు వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకునే విధానం బయట పెట్టాలని ఆదేశించింది. బోర్డు ఆర్ధిక లావాదేవీలు, ఫ్రాంచైజీల వేలం పాట, ఐపీఎల్ సభ్యుల వివరాలు, బ్రాడ్ కాస్టింగ్ హక్కుల అమ్మకం సహా ఇతర అంశాలపై పూర్తి సమాచారం కోర్టుకు అందించాలని ఆదేశించింది. ఇక సోమవారం విచారణకు హాజరైన బీసీసీఐ మాజి చైర్మన్ శ్రీనివాసన్., ఫిక్సింగ్ తో తనకు ప్రమేయం లేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవంగా న్యాయస్థానంకు వెల్లడించారు. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశిచామన్నారు. తన అల్లుడు గుర్నాథ్ మీయప్పన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రా, ఇతర వ్యక్తులపై కంప్లయింట్ నమోదు చేయటంతో పాటు బోర్డు పరంగా అన్ని చర్యలు చేపట్టామన్నారు.

ఐపీఎల్ బిడ్డింగ్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు అవకాశం ఇవ్వటంపై శరద్ పవార్ ను సలహా కోరి.., ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకున్నామని కేసులోకి కొత్త వ్యక్తిని లాగారు. ఇక ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన శ్రీనివాసన్.., ధోనిని కెప్టెన్ హోదా నుంచి తొలగించమన్నారు. ప్రస్తుతం కోర్టు కేసుపై విచారణ జరుపుతున్నందున మరిన్ని కామెంట్లు చేయలేనన్నారు. ఇక తన ఆధీనంలోని ఇండియా సిమెంట్స్ తో ధోనికి సంబంధాలపై మీడియా ప్రశ్నించగా ‘నేను మీకు ఎందుకు చెప్పాలి?’ అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు.

ఈ కామెంట్లతో శ్రీనివాసన్ వ్యవహార శైలితో పాటు ధోనీపై కూడా అనుమానం కలగక మానదు. ఎందుకంటే స్వయంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్ళు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ అయితే.., జట్టు కెప్టెన్ గా ఉన్న ధోని వ్యవహారంపై బోర్డు విచారణ జరపలేదు. తాజాగా కెప్టెన్సి కొనసాగింపుపై ప్రశ్నించగా ఎందుకు తొలగించాలి అని ఎదురు ప్రశ్నించారు. అటు శ్రీనివాసన్ కు  స్పాట్ ఫిక్సింగ్ తో సంబంధం లేదని గతంలో ఓ సారి ధోనీ చెప్పాడు. అయితే తాజాగా ముద్గల్ కమిటీ మాత్రం శ్రీనివాసన్ పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ధోనీ-శ్రీని మద్య ఏదో సంబంధం ఉంది అని అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతానికి వీరి అనుబంధం క్రికెట్, సిమెంట్ వరకే ఉన్నా.., లోతైన విచారణ జరిపితే మిగతా విషయాలు బయటక వచ్చే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srinivasan  supreme court  bcci  ipl spot fixing  enquiry  

Other Articles