మధుమేహం, మరో పరిబాషలో చెప్పాలంటే.. తీపి రోగం, చక్కరి వ్యాధి. ఇలా అనేక పేర్లు. ఈ మద్యకాలంలో సర్వసాధరణమైన వ్యాధి ఇది. నిర్లక్ష్యం చేస్తే.. అతి భయంకరమై.. ప్రాణాలను సైతం హరించే వ్యాధి ఇది. 2014లో చేపట్టిన సర్వేల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 387 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని అంచనా. సగటున తీసుకుంటే ప్రతీ వంద మందిలో 9 శాతం మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలుతుంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొవడం ఒక్కటే మార్గం.
మూడు రకాలుగా వున్న ఈ వ్యాధిలో అనేక మంది సుమారుగా 90 శాతం మంది రెండో రకం డయాబిటిస్ వ్యాధిబారిన పడుతున్నారని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కనుగోనింది. సెంట్రల్ ఒబెసిటీ (నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం) ఇన్సులిన్ రెసిస్టన్స్కు ముఖ్యకారణంగా వైద్యులు కనుగోన్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 55% రోగులలో ఒబెసిటీ (అధిక బరువు) ఉన్నట్టుగా గుర్తించబడినది. గడిచిన దశాబ్దంలో ఈ వ్యాధి చిన్న పిల్లలు మరియు యుక్త వయస్కులలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది, దీనికి అహారాపు అలవాట్లు కారణంగా వైద్యులు పేర్కోంటున్నారు.
వేదకాలంలోనూ మధుమేహ ప్రస్తావన వుందని, అ కాలంలో మధుమేహాన్ని అశ్రమ పేరుతో గుర్తించారని.. చరక సంహిత, శుశ్రవసంహిత మరియు నాగబట్ట గంధ్రాలతో ఈ వ్యాధి లక్ష్యణాలను వర్ణించారని ఆధ్యాత్మిక వేత్తలు ఊటంకిస్తున్నారు. ఆరవ శతాబ్ధంలో అష్టాంగ హృదయ అనే గ్రంధంలో మధుమేహం గా నామకరణం చేయబడింది. అయితే 1400 సంవత్సారాల క్రితమే ఈ వ్యాధికి పథ్యం, ఔషధ్యం మరియు వ్యాయామంతో క్రమపర్చవచ్చని కూడా శాస్త్రాలలో పేర్కొని వుందని చెబుతున్నారు. మధుమేహం తీవ్ర రూపం దాల్చడంతో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విధానం కూడా ఇదే కావడం గమనార్హం.
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కూడా ఈ విధానాన్ని ప్రజలకు వివరిస్తూ.. వారితో ఆచరింపజేస్తూ.. ప్రపంచ మానవాళిని మధుమేహ నుంచి రక్షించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా చర్యలు చేపడుతూనే వున్నారు. బాబా రాందేవ్ అదేశానుసారం 7 ప్రాణాయామాలను సరిగ్గా ఆచరిస్తే.. మధుమేహ వ్యాధి అదుపులో వుంటుందంటున్నారు. కేవలం మధుమేహమే కాదు ఈ వ్యాధి వల్ల వచ్చే పలు సమస్యలను ప్రాణాయామాలు క్రమపర్చుతాయని అంటున్నారు. ఈ వ్యాధిబారిన పడిన వారు హృద్రోగ వ్యాధితో పాటు సంబంధిత వ్యాధులకు కూడా లోనవుతారని చెబుతున్నారు. సో ఫ్రెండ్ మధుమేహాన్ని నియంత్రించడానికే, రాకుండా జాగ్రత్త పడటానికి ఈ ప్రాణాయామాలు దోహదపడుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more