Dubai smart city company investors invest money telangana state hyderabad city

hyderabad smart city, telangana ministers, ktr dubai tour, dubai smart city company ceo al-mulla, ktr dubai meeting, dubai smart city officials, dubai investory, hyderabad city news, trs party news

dubai smart city company Investors invest money telangana state hyderabad city : after telangana ministers, dubai smart city officials and dubai investors meeting... they are ready to invest money in hyderabad city to develop it as smart city.

‘స్మార్ట్’కోసం దుబాయ్’తో తెలంగాణ రహస్య ఒప్పందాలు

Posted: 12/15/2014 06:52 PM IST
Dubai smart city company investors invest money telangana state hyderabad city

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీని ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే! అందులో భాగంగానే ఆ కార్యక్రమాలను చకచకా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుకుగాను దుబాయ్ వారితో రహస్య ఒప్పందాలు కుదుర్చున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తమతో భాగస్వామ్యం కావాలన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆహ్వానానికి ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ సీఈఓ అల్-ముల్లా సానుకూలంగా స్పందించారు కూడా!


మంత్రి కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జయేష్ రంజన్‌ తదితరులు దుబాయ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారందరూ కలసి ఆదివారం అక్కడి ‘దుబాయ్ స్మార్ట్ట్ సిటీ’ కార్యాలయంలో ఆ సంస్థ సీఈవో ముల్లా, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ బాజు జార్జ్‌తో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టులో అంతర్భాగంగా హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విషయాలపై చర్చించారు. ఐటీఐఆర్ హైదరాబాద్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిన ముల్లా.. వారం రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని నిర్ణయించారు.

ఇంతకీ వారు ఏర్పరుచుకున్న రహస్య ఒప్పందాలు ఏంటో తెలుసా..?

దుబాయ్‌లోని క్రౌన్‌ప్లాజా హోటల్‌లో ఆదివారం నిర్వహించిన ‘ఇన్వెస్టర్స్ మీట్’లో మంత్రి కె.తారకరామారావు పాల్గొని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించారు. దీంతో అక్కడి పారిశ్రామికవేత్తలు టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, బయోటెక్నాలజీ, సాధారణ ఇంజనీరింగ్ ఆధారిత రంగాలు తదితర వాటిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఈ సమావేశం ఫిక్కీ, ఐబీపీసీ, దుబాయ్, ఇండియన్ కాన్సులేట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad smart city  ktr dubai meeting  dubai smart city  telugu news  

Other Articles