2014 సార్వత్రిక ఎన్నికలతోబాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన జగన్’కు చివరకు నిరాశే మిగిలిన సంగతి అందరికీ తెలిసిందే! ఇక అప్పటినుంచి ఆయన అధికార పార్టీని లక్ష్యం చేసుకుని ఆ పార్టీ మీద నిత్యం ఆరోపణలు గుప్పించడాన్నే పనిగా పెట్టుకున్నారు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సమావేశాలు, ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన దాదాపుగా చాలా నిరసన కార్యక్రమాలే నిర్వహించి సరికొత్త రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నారు. ఇంతటితో ఆయన ఆగడం లేదు.. ఇంకా మున్మందు రకరకాల పేర్లతో ఉద్యమాలను నిర్వహిస్తూనే వున్నారు.
ప్రతిపక్షం హోదాలో వున్నాక ఆ మాత్రం చేయకపోతే ప్రజలు తమను గుర్తించరేమోనన్న ధ్యాసతో ఇలా చేయక తప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఇటువంట కార్యక్రమాలను నిర్వహించకపోతే ఎక్కడ తమ పార్టీలోని నేతలు, అనుచరులు పక్కపార్టీలవైపు జంప్ అవుతారోనన్న భయంతోనే ఇలా పరుగులు పెట్టాల్సి వస్తోందంటున్నారు. ఇక మీడియా కూడా ‘అసలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉందా లేదా?’ అంటూ ఎక్కడా దుమ్మెత్తిపోస్తుందోనన్న భావనతో ఇలా చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఒకవేళ ఇలా చేయకపోతే ప్రజలతోబాటు ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవడం మానేస్తారోనన్న భయంతో ఏ ప్రతిపక్ష పార్టీలైనా ఇలా వ్యవహరించాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారంతా!
అందుకే.. జగన్ కూడా తన పార్టీ ప్రతిష్ట దిగజారకూడదని, ప్రజల దృష్టి తమ పార్టీనుంచి మళ్లగూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వంపై ఏదో ఒక కారణంతో నిరసనలు చేయడం జరుగుతోందని అంతా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం తన హామీలను అమలుచేయకపోవడాన్ని నిరసిస్తూ వైకాపా మొన్నే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, మహా ధర్నాలు నిర్వహించింది. అయితే ఆ ధర్నాలకు మొదట్లో అంత స్పందన రాలేదుగానీ.. తర్వాత వైజాగ్’లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధర్నాకు కూర్చోవడం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసమీకరణ చేయడంతో అక్కడ జనాలు బాగానే కనబడ్డారు.
ఇంతవరకు బాగానే వుంది కానీ.. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే నెల 6, 7 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ధర్నాలు చేయడానికి సన్నధ్దమవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సార్వత్రిక ఎన్నికలలో ఆ జిల్లాలో వైకాపా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే.. ఆ జిల్లాలో పార్టీకి అంత పట్టులేదని అర్ధమవుతోంది. అంటే.. అక్కడి జనాలు దాదాపుగా ఈ ధర్నాకు రాకపోవచ్చని తెలియకనే తెలిసిపోతుంది. ఆ జిల్లాలో జగన్ ధర్నాకు కూర్చోన్నాక ధర్నా కార్యక్రమంలో జనాలు కనబడకపోతే చాలా అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి.. అక్కడి స్థానిక నేతలు మళ్ళీ జనసమీకరణ కోసం చెమటోడ్చక తప్పదు.
ఆ వ్యవహారాలను కాస్త పక్కన పెడితే.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జగన్ ఎంచుకున్న ధర్నా ఎంచుకొన్న సమయం అంతా సరిగ్గాలేదని అందరూ అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సంక్రాంతి పండుగకు సరిగ్గా వారం రోజుల ముందు ధర్నాకు కూర్చోవడం వలన ఆశించిన ఫలితం కనబడకపోవచ్చు. అదే అసెంబ్లీ సమావేశాలకు ముందు తనకు బాగా పట్టున్న ఏ కడపలోనో నెల్లూరులోనో ధర్నాలో, మహామహా ధర్నాలో విజయవంతంగా చేసుకొని ఉంటే, ఆ పేపర్ కటింగులు పట్టుకొనొచ్చి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉండేది. కానీ.. అసలు బలం లేని చోట ప్రజలందరూ పెద్ద పండగకి సిద్దమవుతున్న సమయంలో ధర్నాలు చేయడం తప్పు నిర్ణయమేనని అందరూ జగన్’కు హితువులు పలుకుతున్నారు. మరి.. ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు, జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి... అలాగే ఆ ధర్నాకు ఆ రాష్ట్ర ప్రజలు ఎలా ఆదరణ ఇస్తారో చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more