Sky way flyovers elevators solve hyderabad traffic problems

hyderabad sky ways, hyderabad sky way routes, hyderabad skyway flyover project updates, hyderabad traffic problems solutions, kcr on hyderabad, telangana latest updates, telangana problems and solutions, kcr telangana government on development, latest telugu news updates

sky way flyovers elevators solve hyderabad traffic problems : telangana cm kcr plans to build skyways in hyderabad to solve traffic problems proposes 11 skyways in major traffic junctions of the city

హైదరాబాద్ లో ఆకాశ మార్గాలు

Posted: 12/20/2014 07:30 AM IST
Sky way flyovers elevators solve hyderabad traffic problems

తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రోజుకో కొత్త పధకం ప్రవేశపెడుతున్నారు. సమస్య ఉందంటే వెంటనే పథకం ప్రకటించి.. అమలుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా హైదారబాద్ ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యనుఅంతమొందించేందుకు సీఎం పరిష్కార మార్గం ప్రకటించారు. భాగ్యనగరంలో స్కై వేలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష జరిపిన సీఎం.., నగరంలో 11 చోట్ల ఆకాశ మార్గాలు నిర్మించాలన్నారు. అంతేకాకుండాఎలివేటర్లు, కారిడార్లు, మల్టీ లెవల్ గ్రేడ్ సపరేటర్లు నిర్మించాలని సూచించారు.

ఇందుకు అవసరమైన ప్రదేశాలను కూడా సూత్రప్రాయంగా ఎంపిక చేశారు. నగరంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉండే 11ప్రాంతాల్లో ఈ ఆకాశ మార్గాల నిర్మాణం జరగనుంది. హరిహరకళాభవన్-ఉప్పల్, మాసబ్ ట్యాంక్-హరిహరకళఆభవన్, నాగార్జున సర్కిల్-మాదాపూర్, తార్నాక-ఈసీఐఎల్, చార్మినార్-బీహెచ్ఈఎల్, మార్గాల్లో వీటిని నిర్మించనున్నారు. మద్యలో ఎక్కడైనా మెట్రో అడ్డు వస్తే.., ఆ పిల్లర్లపై నుంచి ఈ ఫ్లై ఓవర్లను నిర్మించాలని సూచించారు. ప్లాన్ బాగానే ఉంది కానీ.., ఖర్చు చూస్తేనే వణుకుపుడుతోంది. ఒక్క ఫ్లై ఓవర్ నిర్మించాలంటేనే వందల కోట్ల ఖర్చు అవుతుంది. అలాంటిది 11 స్కై వేలు అంటే ఎంత ఖర్చు అవుతుందో లెక్క తేలాల్సి ఉంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad sky ways  traffic problems  kcr telangana plans  

Other Articles