వివాహితపై కన్నేసిన యువకుడు అమె లొంగదీసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. అమె లొంగకపోవడంతో వేధిస్తూ నరకం చూపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖరరెడ్డి నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. క్రైమ్స్ అదనపు డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బేగరి ప్రవీణ్‌కుమార్ (32) జులాయి. అదే గ్రామానికి చెందిన వివాహిత (30) తన కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లి వచ్చే సమయంలో ప్రవీణ్ పరిచయం చేసుకున్నాడు. అతని పద్ధతి బాగోలేకపోవడంతో ఆమె మాట్లాడటం మానేసింది.
ఇది మనసులో పెట్టుకున్న ప్రవీణ్.. ఓ కళాశాలో చదువుకుంటున్న ఆమెకు ... ప్రిన్సిపాల్‌తో వివాహేతర సంబంధం ఉందని గోడలపై రాతలు రాశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. ప్రిన్సిపాల్ అప్పట్లో ఈ విషయంపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో నిందితుడుని గుర్తించలేదు. దీంతో తనను ఎవరు పట్టుకోలేరని భావించిన ప్రవీణ్...ఆమె సెల్‌ఫోన్ నెంబర్లు సులభ్ కాంప్లెక్స్ గోడలపై రాశాడు.
దీంతో పలువురు ఆ నెంబర్‌కు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను కూడా తెరచి అశ్లీల దృశ్యాలను అందులో పెట్టాడు. ఆమె సెల్‌ఫోన్‌కు కూడా అసభ్యకరమైన ఎస్ఎంఎస్లు చేశాడు. అతని వేధింపులు భరించలేని బాధితురాలు గతనెల 3న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాంకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more