రెండు కోతుల కథ....
ఒక సంఘటన మానవత్వాన్ని తట్టి లేపేది అయితే.., ఇంకో సంఘటన మనిషికి.., మర్కటానికి మధ్య మమతానురాగాన్ని తెలిపేది... ఈ రెండు సంఘటనలు మనిషి మదిలో మరుపురాని సంఘటనలుగా నిలుస్తాయేమో...!! నిలవటమే కాదు మనిషికి మానవత్వం విలువలు కూడా తెలియజేస్తాయేమో...!!
సాటి మనిషి ప్రమాదం లో ఉంటె మనకెందుకు లేరా బాబు లేనిపోనివన్ని అనుకొని అవసరమైతే ఆ ప్రమాదాన్ని తన హస్తాభరణంలో (మొబైల్) అందంగా బంధించి మరీ పక్కకు తప్పుకొని వెళ్లిపోతాడు. తర్వాత ఆ సంఘటన గురించి మాట్లాడుతూ వేరేవాళ్ళతో ఇది దారుణం ఇది గోరాతి ఘోరం, ఇది అమానుషం అని ఉపమానాలు పలికే ఉద్ఘండ ఉత్తేజిత మహానుభావులున్న ఈ సమాజంలో.... మానవత్వమే మనుషులను ప్రశ్నిస్తుంది... "మానవత్వాన్ని నేనెక్కడ అని".......?? మనిషికి మానవత్వం ఉందనే సంగతి మరుస్తున్న వేళా... ఈ జరిగిన సంఘటన మనసున్న మనుషులకు "మనసునంటూ" నేనున్నానని గుర్తు చేస్తుందేమో. నిజంగా అది ఈ రోజటి మనిషి స్వభావం. ఒక్క మాటలో చెప్పాలి అంటే "సంపాదనా స్వార్థమనే పురుగులు పట్టి కుళ్ళిపోతున్న శవాల నడుమ.., మానవత్వం మట్టిన కలిసి సమాజం శ్మశానంలా కంపు కొడుతున్నది. అలంటి ఈ సమాజంలో ఒక ప్రాణి తన తోటి ప్రాణి ని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేసి.., ఆ ప్రయత్నానికే దాని ప్రయత్నం గొప్పది అనిపించి.., తన తోటి ప్రాణాన్ని దిగ్విజయంగా నిలబెట్టేల చేసింది.
అదీ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ రైల్వే స్టేషన్... అందరూ ఎవరి రైలు ఎప్పుడోస్తుందా....?? ఎప్పుడేక్కి గమ్య స్థానాలకు చేరుకుందామా అని ఎదురు చూస్తున్న తరుణం. అప్పుడే ఒక వానరం పైనున్న ఫుట్ పాత్ నుండి క్కడ రైల్వే కరెంట్ తీగలకు తాకుకుంటూ జారి పడి కింద పడింది. కింద అలానే పడి పడగానే... అంతే అది చుసిన సాటి వానరాలన్నీ ఒక్కసారిగా అన్ని కలగలిపి వచ్చాయి. అందులో ఒక వానరం దాన్ని లేపటానికి విశ్వ ప్రయత్నం చేసింది. బురద లో పడ్డ దాన్ని తీసి వీపు నిమురుతూ దాన్ని రక్షించటానికి తన శక్తినంతా ఉపయోగించింది. ఆ సమయం లో ఒకానొక దశలో అది సాధ్యం కాకా.., ఎవరైనా వస్తారేమో దిక్కులు చూసినపుడు దాని చూపు వ్యర్థ అయ్యిందే కాని ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయం లో మన భూలోక బంగారు ముద్దు బిడ్డలు చాలా బిజీ గా గడిపారు.. ఆ సమయం లో ఆ సుందరమైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి.., అది అందరికి చూపించుకుంటూ లెక్చర్లు ఇవ్వాలి కదా.. అంతే కదా.. ఈ బిజీ మనుషుల భూలోకం అంత కన్నా ఎక్కువ ఎం చేయగలదు. లోకంలో జరిగిన దాని గురించి టీవీలలో చూస్తూ అర్రే అక్కడ అలా జరిగుంటే బావుండేది. ఇక్కడ అలా కాకుండా ఇలా అయ్యుంటే బావుండేది అని అనుకునే మంచి మనుషులున్న ఈ "మాలోకానికి" ఈ వానరం వానరమైన తన జాతి నుండే ఉద్భవించిన మనిషికి మానవత్వపు పరిమళాన్ని చూపించింది. ఇదొక సంఘటన....
మరొక సంఘటనలో..... వారు కడు పేదలు., వారికి ఆ ఆటనే వృత్తి. తరతరాల నుండి వారికి వారసత్వంగా ఆ వృత్తి సంక్రమిస్తున్నది. కాని ఆ ఆటలో ఒక ప్రాణి సహాయం కూడా కావాలి. అదే కోతి.... ఆ కోతినే వారు ఆడిస్తూ ప్రజల్ని రంజింపజేస్తూ జీవనోపాధి పొందుతారు. ఆ కోతే వారికి పరోక్షంగా వారి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళటానికి కారణం అవుతుంది. అటువంటి కోతితో నిజంగా వారి అనుబంధం విడదీయరానిది. అలా హైదరాబాద్ నగరం లోని ఒక ప్రాంతంలో ఆ కోతి ని ఆడిస్తూ అక్కడ నాలుగు పైసలు వస్తాయేమో అన్న ఆలోచనతో నాలుగు సాహాస కృత్యాలు చేస్తుంటే ఆ సమయంలో అటుగా పోతున్న యువతీ... ఆ ఆటను చూసి, అది చూసిన తర్వాత తనలో అప్పటికప్పుడు ఒక సామాజిక స్పృహ గుర్తొచ్చింది. ఆ ప్రాణిని వాళ్ళు ఆడిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని ఆమె గ్రహించింది... అలా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని అక్కడే వచ్చింది అసలు సమస్య.. ఆ కోతితో వారికి విడదీయరాని బంధం ఉంది. పైగా ఆ కోతే వారికి జీవనాధారం. ఆ కోతిని తన సొంత కొడుకులా చూసుకుంటానని, దాన్ని వదిలి మేముండలేమని చెప్తూ, కన్నీరు పెట్టుకుంటూ పోలిసుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు ఆ కోతిని ఆడించేవాళ్ళు. ఆ యువతీ చేసింది సామాజిక బాధ్యతతో అయినా.., ఆ యువతీ చేసింది తప్పా.. ఒప్పా అని పక్కన పెడితే.., ఆ కోతితో వారి అనుబంధం విడదీయనిదేమో....!! ఒక్కోసారి మనకు జంతువులకు మధ్య అనుబంధం మాటల్లో చెప్పలేనిది. అందుకే అక్కడ వారి వేదన వర్ణానాతీతం.... అక్కడ ఆ కోతి ని పోలీసులు తీసుకెళ్ళిన వెంటనే వారి రోదనను చూసి అందరి మనసులు చలిస్తాయి.
ఈ రెండు సంఘటనలను చూసైనా మానవత్వాన్ని మట్టిలో కలుపుతున్న "మనసున్న మహానుభావులకు" కనువిప్పు కావాలని తెలుగు విశేష్ మనస్పూర్తిగా కోరుకుంటుంది.
హరికాంత్ రామిడి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more