Enforcement directorate jagan case enquiry three months deadline

jagan case updates, jagan assets case latest, cbi on jagan, jagan case enforcement directorate cases, enforcement directorate on jagan latest updates, ysr congres updates, enforcement directorate jobs, latest news updates

enforcement directorate jagan case enquiry three months deadline : enforcement directorate decides to complete jagan case enquiry with in three months and submit report to court

జగన్ కు ఫైనల్ డేట్ ఫిక్స్! ‘రేసుగుర్రం’ ఆపరేషన్ స్టార్ట్

Posted: 12/23/2014 09:47 AM IST
Enforcement directorate jagan case enquiry three months deadline

వైసీపీ అధినేత జగన్ కు ఫైనల్ డేట్ ఫిక్స్ అయింది. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ బాబు ఆస్తులపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్, ఇన్ కం టాక్స్ వంటి దేశంలో ఉన్న సంస్థలన్నీ విచారణలో పాలు పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో విదేశాల నుంచి హవాలా నిధులు, అక్రమంగా డబ్బు మల్లింపు, అక్రమాస్తులను గుర్తించే కీలక బాద్యతను చేపట్టిన ఈడీ జగన్ కేసు విచారణకు డేట్ ఫిక్స్ చేసింది. మూడు నెలల్లో అంటే వచ్చే ఏడాది మార్చి లోపు బాబు ఆస్తులన్నిటిపై దర్యాప్తు చేసి అక్రమాస్తులు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.

వేగంగా ధర్యాప్తు చేసేందుకు జగన్ కు సంబంధించిన కేసులన్నిటినీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బదలీచేశారు. ఇప్పటివరకు రూ. 1,139 కోట్ల ఆస్తులు  సీజ్ చేసిన ఈడీ మూడు నెలల్లో మిగిలిన అక్రమాస్తులను స్వాధీనం చేసి తాళం వేయనుంది. హవాలా, మనీలాండరింగ్ ఇతర అక్రమ మార్గాల ద్వారా వచ్చిన డబ్బును గుర్తించేందుకు రేసుగుర్రంలా వేగంగా పనిచేయాలని డిసైడ్ అయి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు సిబిఐ 11  కేసులు నమోదు చేసింది. వీటిలో పది చార్ఝ్ షీట్లను తీసుకున్న ఈడీ అందులో పేర్కొన్న ఆస్తుల వివరాలు పరిశీలిస్తోంది.

కేవలం జగన్ కంపనీల ఆస్తులే కాకుండా వైఎస్ తనయుడి వల్ల అక్రమంగా లబ్ది పొందిన కంపనీల ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే హెటిరో, అరబిందో, వాన్ పిక్, రామ్ కీ ఫార్మా సహా ఇతర కంపనీల ఆస్తులను ఈడీ దగ్గరపెట్టుకుంది. దీంతో నాడు సీఎంచే పనిచేయించుకున్న పెద్దలు ఇప్పుడు భయపడుతున్నారు. జగన్ కేసులో ఆరోపణలెదుర్కుంటున్న ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ఆస్తులకూ ముప్పు ఉంది. ఈ కేసు ధర్యాప్తు పూర్తయితే కోర్టు విచారణ మొదలు పెట్టనుంది. అది కూడా పూర్తయితే జగన్ జీవితం చెరసాలకు అంకితమా లేక ప్రజలకు అంకితమా తేలనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : enforcement directorate  jagan assets case  ysr congress latest  

Other Articles