Sonia gandhi discharged from hospital

Sonia Gandhi discharged from hospital, sonia discharged from hospital, sonia gandhi discharged, sonia recovered from infection, Sonia dischareged from Sir Ganga Ram Hospital, New Delhi, Dr Arup Kumar Basu, senior consultant, respiratory medicine department, Sonia Gandhi recovered, sonia recovered respiratory infection

Congress President Sonia Gandhi, who has been hospitalised for lower respiratory tract infection, has been discharged

అనారోగ్యం నుంచి కోలుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ

Posted: 12/23/2014 04:06 PM IST
Sonia gandhi discharged from hospital

అనారోగ్యం బారిన పడిన గత రెండు రోజుల క్రితం అస్పత్రిలో చేరిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధి కోలుకున్నారు. ఇవాళ పూర్తిగా కోలుకున్న సోనియా గాంధీని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడుతున్నసోనియాగాంధీని గత ఐదు రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పారు. ఐదు రోజులుగా సోనియాగాంధీని తమ పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు.. అమెకు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల ఆధారంగా అమెకు చికిత్సనందించిన వైద్యులు అమెను ప్రత్యక విభాగంతో వుంచి పర్యవేక్షించారు. ఐదు రోజుల అనంతరం అమె కోలుకున్నారు.
 
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు సోనియాను పరామర్శించేందుకు 10 జనపథ్ కు తరలివెళ్తున్నారు. అయితే సోనియా గాంధీని పరామర్శించడానికి ఢిల్లీలోని నివాసానికి, కార్యాలయానికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు ఎవరూ తరలిరావద్దని పార్టీ అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తమ అధినేత్రికి విశ్రాంతి అవసరమని, వైద్యుల సూచనల మేరకు అమె విశ్రాంతి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన పూజలు ఫలించాయని.. త్వరలోనే అమె ప్రజల మధ్యకు వస్తారని పార్టీ వర్గాల సమాచారం.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  lung infection  recovered  discharged  Sir gangaram Hospital  

Other Articles