Pv narasimharao is also eligible for the bharat ratna says kcr

Bharat Ratna for PVNarasimha Rao, Bharat Ratna for former prime minister PV, KCR demands bharat ratna for PV, indian Highest civilian award for PV, PV eligible for bharat ratna, Telangana government demands bharat ratna for PV

Telangana Chief Minister K. Chandrasekhar Rao called for conferring Bharat Ratna, India's highest civilian award, on former prime minister, the late P.V. Narasimha Rao.

పీవీ నరసింహారావుకు అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిందే..

Posted: 12/24/2014 09:05 PM IST
Pv narasimharao is also eligible for the bharat ratna says kcr

మాజీ ప్రధాని వాజ్పేయి, స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యలకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహనీయులను మర్చిపోకుండా దేశ అత్యున్నత పురస్కారాలను ఇచ్చి గౌరవించడం సమంజమన్నారు. కాగా తెలంగాణ రాజకీయ దురంధరుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వకపోవటం వెలితిగా ఉందని  కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పీవీకి భారతరత్న ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని బుధవారం పేర్కొన్నారు. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాల్సిందన్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ను బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామీ కూడా స్వాగతించారు. పివీ నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ దశదిశను మార్చాయని అభిప్రాయపడ్డారు. పీవీ ఆర్థిక సంస్కరణ ఫలితంగానే దేశం ఆర్థకంగా సుస్థిరంగా వుందని సుబ్రహ్మణ్య స్వామి కోనియాడారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV narasimharao  bharatratna  kcr  telangana assembly  subramanya swamy  

Other Articles