V hanumantha rao demands modi to bring dawood to india

V Hanumantha Rao, V Hanumantha Rao on Modi, V Hanumantha Rao criticise Modi, V Hanumantha Rao latest, Narendra Modi on Dawood Ibrahim, Dawood Ibrahim in Pakistan, Dawood Ibrahim India, Dawood Ibrahim latest, Dawood Ibrahim illegal activities, Pakistan Saves Dawood Ibrahim, India on Dawood Ibrahim, Mafia Don Dawood Ibrahim, india latest news

V Hanumantha Rao demands modi to bring dawood to india : congress leader and rajyasabha member V Hanumantha rao demands Narendra Modi to brind Dawood to India

మాటలు కాదబ్బా మోడీ.. చేతల్లో చూపు

Posted: 12/28/2014 02:28 PM IST
V hanumantha rao demands modi to bring dawood to india


కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు ప్రధాని మన్మోహన్ సింగ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉగ్రవాదం, నల్లధనంపై ప్రపంచ దేశాల ముందు ప్రకటనలు చేస్తున్న ప్రధాని చేతల్లో చూపటం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగాలు చేసి... ఆ తర్వాత పట్టించుకోవటం లేదన్నారు. మోడి ధమ్మున్న నేత అయితే... దావూద్ ఇబ్రహీంను భారత్ కు తీసుకురావలని డిమాండ్ చేశారు.

‘దావూద్ కోసం కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ ను కోరటం కాదు.. పాక్ కు వెళ్ళి ఉగ్రవాదిని పట్టుకుని రావాలి’ అని చెప్పారు. ఇది తన సవాల్ గా స్వీకరించి చేసి చూపాలని వీహెచ్ అన్నారు. అటు నల్లధనంపై కూడా కేంద్రం నోటి మాటలు తప్ప పనులు చేయటం లేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజలకు పంచుతానని ఎన్నికల ముందు చెప్పిన మోడి.., ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం, మోడిపై వీహెచ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజా కామెంట్లను సర్కారు సీరియస్ గా తీసుకుంటుందా లేక, వీహెచ్ కదా అని లైట్ గా పక్కకు నెట్టేస్తుందా చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : V Hanumantha Rao  Dawood Ibrahim  Narendra Modi  

Other Articles