Airport employee complains on live in together partner

Rajiv gandhi international airport, Rajiv gandhi international airport employee, Hyderabad Rajiv gandhi international airport, international airport employee police complaint, complains to police on live in together relationship partner, complains to police on live in together partner, complains on live in together relationship partner, complains on live in together partner,

Rajiv gandhi international airport employee complains to police on live in together relationship partner

అడుగడుగునా నయవంచకులు.. అమ్మాయిలూ జాగ్రత్త..!

Posted: 12/29/2014 10:28 PM IST
Airport employee complains on live in together partner

అమాయకురాళ్లయిన అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. పెళ్లి చేసుకుంటామని ప్రమాణం చేసి.. కొన్నాళ్లు సహజీవనం చేద్దామని, లేదా డేటింగ్ పేరుతో మీ చెంతకు చేరే అనేక మంద యువకులలో నయవంచకులు వున్నారు. మీరు జాగ్రత్తా చర్యలు తీసుకోని పక్షంలో మోసపోవడం ఖాయం. ఇప్పటికే అంగీకార శృంగారాన్ని సాగించిన భాగస్వామి పెళ్లి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే ఆ తరహా కేసులు అత్యాచార ఘటనలుగా నమోదు కావని బోంబే హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో మీ జాగ్రత్తను మీరే చూసుకోవాలి. లేని పక్షంలో ఏ నయవంచకుడి కామదాహానికో మీరు బలికావాల్సి వస్తుంది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనను నమ్మించి రెండేళ్ల పాటు తనతో సహజీవనం చేసిన సహోద్యోగి... చివరకు మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తనకు న్యాయం చేయాలని ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన యువతి ఇక్కడకు వచ్చింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తోంది.

ఇదే ఎయిర్‌పోర్టులోని మరో విభాగంలో పనిచేస్తున్న గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన పాల్‌ అంబేద్కర్‌ నిన్ను ప్రేమిస్తున్నానంటూ గుజరాత్‌ యువతి వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించడంతో ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. అయితే పాల్‌ అంబేద్కర్‌ ఇప్పుడు మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తాను అతడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చానని, అన్ని రకాలుగా సాయం చేశానని, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయాడని ఆరోపించింది. మనమధ్య ఉన్న శారీరక సంబంధం విషయాన్ని కూడా ఎవరికీ చెప్పొద్దన్నట్లు తెలిపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : airport employee  shamshabad police  live in together partner  

Other Articles