Airasia plane with 159 aboard overshoots philippine runway

AirAsia plane overshoots runway, AirAsia plane overshoots Philippine runway, 159 passengers on board in airasia plane, AirAsia passenger plane sits on grassy portion of runway, airasia plane overshoots in landing, Airasia plane lands in windy weather, airasia plane overshoots at Kalibo airport, airasia plane overshoots in central Philippines.

Philippines officials say an AirAsia Zest plane with 159 passengers and crew members overshot a runway in a central province after landing in windy weather from Manila.

ఎయిర్ ఏసియా విమానానికి తృటితో తప్పిన పెను ప్రమాదం

Posted: 12/30/2014 09:52 PM IST
Airasia plane with 159 aboard overshoots philippine runway

ఇండోనేషియా జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం గల్లంతై సముద్రంలో కుప్పకూలిపోయిన ఘటన మర్చిపోక ముందే ఫిలిప్పైన్స్‌లో ఎయిర్ఏషియా విమానానికి మరో పెను ప్రమాదం తృటితో తప్పింది. ప్రతీకూల వాతావరణ పరిస్థుతులను ఎదుర్కోని ఫిలిపైన్స్ లో దిగిన విమానం రన్ వే దాటి పక్కకు వెళ్లింది. ఈ సమయంలో విమానంలో 159 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా వున్నారు. అయితే రన్ వేను దాటి ముందుకు దూసుకెళ్లిన విమానం పక్కనున్న బురదలో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని లేదు. అయితే ఇటీవల జరుగుతున్న వరుస విమానయాన ప్రమాదాల నేపథ్యంలో ఎయిర్ ఏషియా జెస్ట్ విమానంలో వున్న ప్రయాణికులందరూ భయాందోళన చెందారని, విమానంలో హాహాకారాలు వెల్లువెత్తాయని సమాచారం. ఎయిర్ ఏషియా జెస్ట్ విమానాల అపరేషన్స్ ఇంచార్జ్ గ్యోవాన్ని హాన్టోమిన్ మాట్లాడుతూ ప్రస్తుతానికి ప్రయాణికులందరూ సురక్షితంగా వున్నారని, ఎవరు గాయపడినట్లు తమకు సమాచారం లేదని చెప్పారు. బురదలో కూరుకుపోయిన విమానం నుంచి ప్రయాణికులను మరో విమానంలోకి మార్చేందుకు తమ సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asia  Philippine  AirAsia plane  overshoots  

Other Articles