Pakistan govt challenges mumbai attack planner lakhvi s bail in supreme court

Pakistan government challenges Lakhvi's bail, Mumbai attack planner Zaki-ur-Rehman Lakhvi's, pak challanges Lakhvi's bail in Supreme Court, pakistan terrorist Zaki-ur-Rehman Lakhvi's,, islamabad high court order in supreme court,

Pakistan government on Thursday challenged Islamabad High Court's order suspending Mumbai attack mastermind Zaki-ur-Rehman Lakhvi's detention under a public security order in the Supreme Court.

లఖ్వీ బెయిల్ పై సుప్రీకోర్టులో పాక్ పిటీషన్

Posted: 01/01/2015 06:38 PM IST
Pakistan govt challenges mumbai attack planner lakhvi s bail in supreme court

ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఎట్టకేలకు భారత్ వినతులపై స్పందించిన పాకిస్థాన్ ప్రభుత్వం ముంబై మారణహోమం ప్రధాన సూత్రదారి జకీర్ రెహ్మన్ లఖ్వీ బెయిల్ పై ఉన్నత కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ముంబై ముష్కరదాడిలో కీలక సూత్రధారిగా వున్న లఖ్వీని ఇస్లామాబాద్ హైకోర్టు.. లఖ్వీ ప్రమేయంపై సలు సందేహాలను వ్యక్తం చేస్తూ.. నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను మంజూరు చేసింది. ముంబై దాడులలో లఖ్వీ ప్రధాన పూత్రదారుడని పాకిస్థాన్ ప్రభుత్వానికి భారత్ అందజేసిన సాక్షాలను కూడా తోసిపుచ్చుతూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

భారత్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తంకావడం, అటు ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తుండటంతో ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రతిస్పందించింది. లఖ్వీ బెయిల్ పిటీషన్ పై ఆ దేశ సర్వోన్నత న్యాయాస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తివ్రవాది లఖ్వీకి ఇస్లామాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కాగా ఈ కేసులో బెయిల్ లభించడంతో విడుదలైన లఖ్వీని అఫ్టనిస్థాన్ దేశీయుడిని అపహరించిన కేసులో రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 14 వరకు లఖ్వీని జుడీష్యల్ రిమాండ్ ను పోడగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  Zaki-ur-Rehman Lakhvi's  bail petition  supreme court  

Other Articles