Task force formed for operation smile

operation smile nodal head, operation smile head DCP ramarajeshwari, Telangana government operation smile, missing children operation smile, police formed task force for operation smile,

As per the directions of the Ministry of Home Affairs (MHA), Cyberabad Police has launched a month-long dedicated campaign called ‘Operation Smile’

ఆపరేషన్ స్మైల్ నోడల్ అధికారిగా డీసీపీ రమారాజేశ్వరి

Posted: 01/06/2015 09:58 PM IST
Task force formed for operation smile

చైతన్యపురిలో గతేడాది జూన్ 4న మూడేళ్ల బాలిక ఒంటరిగా తిరుగుతుండగా సరూర్‌నగర్ పోలీసులు చేరదీసి నాంపల్లిలోని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు తరలించారు. అయితే ఆ పాప తల్లిదండ్రులెవరు? ఎక్కడుంటారు అనే వివరాలు ఇప్పటి వరకూ తెలియలేదు. ఆ వివరాలు తెలుసుకొనే ప్రయత్నాలూ జరగలేదు.  నిజానికి ఈ పాప తల్లిదండ్రులు దేశంలోని ఏదో ఒక పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసే ఉంటారు. అయితే ఆ పాప సరూర్‌నగర్ పోలీసులకు దొరికిన విషయం అక్కడి పోలీసులకు తెలియకపోవడంతో మిస్సింగ్ కేసు, ఇక్కడి ఠాణాలో పాప లభ్యం కేసు నమోదై ఉంది.  పాప మాత్రం అనాథగా స్వచ్ఛంద సంస్థ నిర్వహించే హోమ్‌లో ఉంటోంది. ఇకపై తప్పిపోయిన ఏ చిన్నారి ఇలా అనాథ కాకూడదని... ఆ చిన్నారి ఇంట్లో తిరిగి చిరు నవ్వులు పూయించాలనే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  
 
 డివిజన్ల వారీగా ...
 
 చిన్నారుల మిస్సింగ్ కేసుల మిస్టరీని ఛేదించేందుకు 55 మందితో సైబరాబాద్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు నోడల్ అధికారిగా మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నియమించారు. కమిషనరేట్ పరిధిలోని 11 డివిజన్‌లలో ఒక్కో టాస్క్‌ఫోర్స్ బృందం ఉంటుంది. ఈ బృందంలో ఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరంతా ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన చిన్నారుల మిస్సింగ్ కేసులపై దృష్టి పెడతారు. బాధితులు, వారి స్నేహితులు, బంధువుల సహకారంతో మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదిస్తారు.  మిస్సింగ్ అయిన చిన్నారుల వివరాలు, వారి ఫొటో, ఎఫ్‌ఐఆర్‌లను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారి వెబ్‌సైట్‌లో ‘నేషనల్ ట్రాకింగ్ సిస్టమ్’లో అప్‌లోడ్ చేస్తారు. అలాగే ఇక్కడ దొరికిన తప్పిపోయిన చిన్నారుల ఫొటోలను సైతం అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఠాణాకు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఉంటుంది. వెబ్‌సైట్‌లో డేటా బేస్‌ను ప్రతి ఒక్కరు చూసుకునే అవకాశం ఉంది.
 
 అనుసంధానంగా వెబ్‌సైట్...
 
 వెబ్‌సైట్‌లో పొందుపర్చిన చిన్నారుల ఫొటోలు, వివరాలను ప్రజలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు వెబ్‌సైట్‌లో అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు సైదాబాద్‌లో మిస్సింగ్ అయిన చిన్నారి ఫొటో అప్‌లోడ్ చేశారనుకోండి...ఇదే చిన్నారి గుజరాత్‌లో వారం తర్వాత అక్కడి పోలీసులకు దొరికితే వారు కూడా చిన్నారి ఫొటోను అదే వెబ్‌సైడ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ఫొటోను సైదాబాద్ పోలీసులు క్లిక్ చేస్తే చాలు గుజరాత్ పోలీసులకు చిన్నారి మిస్సింగ్ వివరాలన్నీ ఈ-మెయిల్ ద్వారా క్షణాల్లో వెళ్తాయి. ఇలా చేయడం ద్వారా దేశంలోని అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌ఓలు చిన్నారుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుం ది. దీని ద్వారా వెబ్‌సైట్ ఇటు మిస్పింగ్ కేసు, అటు ట్రేసింగ్ కేసు ముడి విప్పేందుకు అనుసంధానంగా పని చేస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Task Force  operation smile  cyberabad police  

Other Articles