High alert in nellore district due to terrorists

intelligence warns AP police, intelligence warns of terrorists, inspite of intelligence high alert in nellore, police bandobast at sriharikota, sriharikota on high alert, terrorists in AP, chennai blasts terrorists in AP, terorists in chennai-nellore border,

intelligence warns Andhra pradesh cops, saying that terrorists groups present in nellore

ITEMVIDEOS: ఉగ్రవాదుల కదలికలతో నెల్లూరు జిల్లాలో హైఅలర్ట్..

Posted: 01/07/2015 11:46 AM IST
High alert in nellore district due to terrorists

నెల్లూరు జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. తమ జిల్లాలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలెర్ట్ ను ప్రకటించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ఉనికి చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న ఇస్రో సహా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలో ముమ్మర బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలో సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు బుధవారం హై అలర్ట్ ప్రకటించారు.

చెన్నై బాంబు పేలుళ్ల కేసులో నిందితులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో సరిహద్దుల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. అలాగే తమిళనాడు పోలీసులు ఇప్పటికే తప్పించుకుని తిరుగుతున్న తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు ఇప్పటికే తడ పోలీసులకు పంపించారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టి... అక్కడ పని చేస్తున్నవారి వివరాలను సేకరిస్తున్నారు.  శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అడవుల్లో మావోయిస్టులు తిష్టవేసి ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సిమి తీవ్రవాదులు సైతం తమిళనాడులో తలదాచుకున్నట్లు వెల్లడైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని తడ వద్ద చెక్‌పోస్టు ఉంది. గత ఆదివారం రాత్రి కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో కూడిన కంటైనర్ లారీ తడ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముగించుకుని ముందుకు వెళ్లిన లారీ నుంచి 8 మంది ఉగ్రవాదులు బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని వెంబడించగా, పోలీసులను గమనించిన ఉగ్రవాదులు పారిపోయారు.

అక్కడే వదిలివెళ్లిన కంటైనర్‌ను తనిఖీ చేయగా బియ్యం బస్తాలు, చింతపండు, మిరపకాయల బస్తాలు ఉన్నాయి. వాహనంతో సహా సరుకును స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఆహార పదార్థాలు ఉండడం, పోలీసులను చూడగానే పారిపోవడం, తదితర అంశాల వల్ల వారిని సిమీ తీవ్రవాదులు లేదా మావోయిస్టులుగా భావిస్తున్నారు. పరారైన అనుమానితులు పరిసరాల్లో దాక్కుని ఉంటారన్న నమ్మకంతో సరిహద్దుల్లో తనిఖీలు ప్రారంభించారు. అయితే ఉద్రవాదులు నెల్లూరు జిల్లాలోనికి ప్రవేశించారన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high alert  simi terrorists  sriharikota  sri city  

Other Articles