జేబులో వుండే క్రెడిడ్, డెబిట్ కార్డు క్లోనింగ్ కు గురైందా..? కార్డు పోయిందా..? మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయా..? అయితే వెంటనే వెళ్లి కాంటాక్టు లెస్ కార్డులను తీసుకోండి. దీంతో భద్రతకు భద్రత.. అదీకాకుండా ఎన్ ఎఫ్ సీ టెక్నాలజీతో రూపొందించిన కారణంగా హై సెక్యూరిటీ మీ సోంతం అయినట్లే. ఈ కార్డులు ఎక్కడ లభిస్తున్నాయనేగా మీ ప్రశ్న. మీ కార్డులు తీసుకుని ఈ అత్యంత్య భద్రత కలిగిన కార్డలను బ్యాంకులు జారీ చేస్తాయా.? ఈ కార్డులు ఏం చేయాలనేగా మీ ప్రశ్న.
అందరికీ కాదు కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే దేశంలో తొలిసారిగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, ఎక్స్ప్రెషన్స్ వేవ్ డెబిట్ కార్డులు నియర్ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్సీ) టెక్నాలజీతో పనిచేస్తాయి ఈ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేదని, కదిలిస్తే చెల్లింపులు జరిగిపోతాయి. ఎన్ఎఫ్సీ టెక్నాలజీ వల్ల లావాదేవీలు వేగంగా జరుగడంతో పాటు అత్యంత సురక్షితంగా కూడా ఉంటాయి. ఈ కార్డులను మొదటగా హైదరాబాద్, ముంబై, గుర్గావ్లో ఐసిఐసిఐ బ్యాంకు అధికారులు కస్టమర్లకు అందించారు. ఈ కార్డుల కోసం ఈ నగరాల్లో 1,200 పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేశామని వివరించారు.
ఇతర నగరాల్లో వీటిని మామూలు డెబిట్/క్రెడిట్ కార్డులమాదిరిగానే ఉపయోగించుకోవచ్చని తెలి పారు. లావాదేవీలు వేగంగా జరగడం, భద్రతకు ఢోకా లేకపోవడం వంటి అంశాల వల్ల చెల్లింపుల పరిశ్రమలో ఈ కాంటాక్ట్‌లెస్ కార్డులు పెను విప్లవం సృష్టించబోతున్నాయని వివరించారు. భారత్‌లో ఇంటర్నెట్, మొబైల్, ట్యాబ్, టచ్ బ్యాంకింగ్‌లను తొలిసారిగా అందించిన ఘనత తమ బ్యాంక్‌దేనని ఆయన గుర్తు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more