సంచలనం రేపిన సునంద పుష్కర్ హత్య కేసులో సిట్ పోలిసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. గురువారం పనిమనిషిని విచారించగా.., సునందతో చివరి రెండ్రోజులు సునీల్ అనే వ్యక్తి ఉన్నట్లు తెలుసుకున్నారు. సునీల్ ను విచారించగా అతడు ఐపీఎల్ గురించి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. హత్యకు రెండ్రోజుల ముందు ఎయిర్ పోర్టులో శశి థరూర్ తో సునంద గొడవపడిందనీ.., ఇంటికి వెళ్ళేందుకు కూడా నిరాకరించిందని సునీల్ చెప్పాడు. ఇదే సమయంలో తనకు ఫోన్ చేయటంతో ఎయిర్ పోర్టుకు వెళ్లానని పోలిసులకు తెలిపాడు.
ఇద్దరం కలిసి లీలా హోటల్ లో రూమ్ నెం.307లో ఉన్నట్లు చెప్పాడు. గొడవ నుంచి ప్రశాంతంగా ఉండాలని సునందను కోరినట్లు పోలిసులకు వివరించాడు. ఇదే సమయంలో ఐపీఎల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనీ.., ఇందుకోసం ప్రెస్ మీట్ పెట్టాలని సునంద తనకు చెప్పిందన్నాడు. అయితే ఐపీఎల్ గురించి ఏం చెప్పాలనుకుందో తెలియదన్నారు. ప్రెస్ మీట్ పెట్టాలి అనుకున్న 17వ తేదీనే సునంద హత్యకు గురయిందని వెల్లడించాడు. సింగ్ అనే మరో వ్యక్తిని ప్రశ్నించినపుడు కూడా ఐపీఎల్ గురించి ఏదో మాట్లాడాలి అని సునంద తనతో చెప్పిందన్నాడు. ఇద్దరు వ్యక్తులూ ఐపీఎల్ వ్యవహారంను ప్రస్తావించటంతో ఈ కోణంలో పోలిసులు విచారణ మొదలు పెట్టారు.
థరూర్ కు బిగుస్తున్న ఉచ్చు... ?
సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశి థరూర్ కు ప్రమేయం ఉందని ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఐపీఎల్ వ్యవహారంతో ఇవి మరింత బలపడుతున్నాయి. గతంలో ఐపీఎల్ కొచ్చి ఫ్రాంచైజీ విషయంలో థరూర్ పై ఆరోపణలు వచ్చాయి. తాజాగా సునంద ఐపీఎల్ పై ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఇద్దరు సాక్షులు చెప్పటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే పోలిసులు ఇప్పుడే థరూర్ ను నిందితుడిగా చూపకుండా అన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
లీలా హోటల్ కు వెళ్ళే ముందు ఎయిర్ పోర్టులో సునంద-థరూర్ మద్య గొడవ జరిగినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఈ కారణంగా ఇంటికి వెళ్ళేందుకు మృతురాలు నిరాకరించిందని అంటున్నారు. థరూర్ బలవంతం చేయటంతో సునంద చెంపదెబ్బ కొట్టిందట. దీంతో భార్యను ఎయిర్ పోర్టులోనే వదిలి థరూర్ మాత్రం ఇంటికి వెళ్ళిపోయాడని విచారణలో వెల్లడి అయింది. వీరి గొడవకు కారణం ఏమిటి అనే అంశంపై కూడా పోలిసులు విచారణ చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more