మాజీ కేంద్ర మంత్రి సునంద పుష్కర్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లు పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ కారణంగానే థారూర్ దంపతుల మధ్య గోడవలు జరిగాయని భావిస్తుండగా, మరో మహిళ కోసమే వారిరువురూ గోడవ పడ్డారని తెలుస్తోంది. క్యాటీ అనే మహిళ పేరు తెర మీదికి వచ్చింది. సునంద పుష్కర్ మృతి కేసులో దర్యాప్తు అధికారులు 15 మందిని విచారిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. నవంబర్‌లోనే పోలీసులు 12 మందితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
సునంద పుష్కర్, శశి థరూర్ మధ్య దుబాయ్‌లోనూ ఇతర ప్రాంతాల్లోనూ గొడవకు క్యాటీ అనే మహిళ కారణమని శశి థరూర్ పని మనిషి నారాయణ్ సింగ్ పోలీసుల విచారణలో ఆమె పేరు వెల్లడించినట్లు సమాచారం. అయితే, ఆమెను ఎవరూ గుర్తించినట్లు లేదంటున్నారు. శశి థరూర్‌ను విచారించిన తర్వాత క్యాటీ అనే మహిళను విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, సునంద పుష్కర్ మృతి తర్వాత ఇప్పటి వరకు నోరు విప్పని లీలా ప్యాలెస్ హోటల్ ఉద్యోగి ఒకరిని పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సంజయ్ దేవాన్ అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. జనవరి 17వ తేదీ సాయంత్రం సునంద పుష్కర్ నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో వైద్యులను పిలువాలని అతను హోటల్ మేనేజర్‌కు చెప్పినట్లు నారాయణ్ వెల్లడించినట్లు చెబుతున్నారు.
సంజయ్ సునంద పుష్కర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు నారాయణ్ చెప్పాడని అంటన్నారు. రాకేష్ శర్మ అనే ఫ్యామిలీ ఫ్రెండ్ గురించి కూడా నారాయణ్ ప్రస్తావించినట్లు సమాచారం. దాంతో ఆయనను కూడా ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. థరూర్‌ను ప్రశ్నించడానికి లేదా మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించడానికి సిట్ బృందం కేరళలకు వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఈ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌ను విచారించడానికి ఢిల్లీ పోలీసులు ప్రశ్నలను తయారు చేసినట్లు సమాచారం. మెహర్ తరార్‌కు ఈమెయిల్‌లో ప్రశ్నలు పంపి సమాధానాలు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునంద పుష్కర్ మృతికి కొన్ని రోజుల ముందు మెహర్ తరార్ శశి థరూర్‌ను కలిశారు. ఈ విషయంలో తాను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తరార్ ఇటీవల ఓ టీవీ చానెల్‌తో చెప్పిన విషయం తెలిసిందే.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more