10 degrees celsius makes hyderabad shiver january to be coldest month

10 degrees Celsius makes Hyderabad shiver, January to be coldest month, coldest day so far in winter, cold winds for next three days, cold temperatures rock telangana, cold temperatures rock few districts of andhra, cold weather, pongal,

The city shivered at 10 degrees Celsius, the coldest day so far this season. In its weather forecast for the next three days, “cold wave” condition would prevail over all districts of Telangana State and a few in Andhra Pradesh.

చిగురుటాకులా వణుకుతున్న హైదరాబాద్, ఆంధ్రా

Posted: 01/11/2015 06:23 PM IST
10 degrees celsius makes hyderabad shiver january to be coldest month

కోస్తాంధ్ర, తెలంగాణలో సంక్రాంతి వరకూ చలి తీవ్రత కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఉత్తరాది నుంచి గాలులు వీచడంతో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఎలాంటి అలజడి లేకపోవడం కూడా మరో కారణమని పేర్కొంది. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఒడిశాలలో 4 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

శీతల గాలులు వీస్తుండడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చలి బాగా పెరిగింది. ఈ శీతాకాలంలో హైదరాబాద్‌లో తొలిసారి కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ, కోస్తాలోని కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో శీతలగాలులు ఇంకా అధికమవుతాయని హెచ్చరించింది. మరో మూడు రోజులు ఆయా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని అంచనా. ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదై చలి బాగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర భారతం నుంచి పొడి శీతలగాలులు తెలంగాణ, కోస్తాలపైకి అధికంగా వస్తున్నాయి. మరోవైపు ఆకాశం నిర్మలంగా ఉండటంతో భూవాతావరణం త్వరగా చల్లబడుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cold weather  pongal  visakhapatnam meteorological department  

Other Articles