Arson attack at german paper that ran charlie hebdo cartoons police

Arson attack at German paper, Arson attack at Hamburger Morgenpost, northern port city of Hamburg, German newspaper that reprinted Mohammed cartoons, Hamburger Morgenpost, German paper, Charlie Hebdo, ARSON attack, French satirical paper Charlie Hebdo, two suspects arrest,

A German newspaper in the northern port city of Hamburg that reprinted Mohammed cartoons from the French satirical paper Charlie Hebdo was the target of an arson attack early Sunday, police said.

జర్మనీ పత్రికా కార్యాలయంపై ఆగంతకుల దాడి

Posted: 01/11/2015 06:30 PM IST
Arson attack at german paper that ran charlie hebdo cartoons police

పారిస్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డోపై దాడి మరవక ముందే జర్మనీలోని మరో పత్రిక కార్యాలయంపై అగంతకులు దాడులకు పాల్పడ్డారు. హంబర్గ్ నగరంలోని హంబర్గర్ మోర్గాన్ పోస్ట్ పత్రిక ప్రధాన కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఆ తరువాత మండే పదార్థాలతో దుండగులు దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సెటైర్ పత్రికగా ప్రముఖ్యత పొందిన చార్లీ హెబ్డో లో ప్రచురితమైన కార్టూన్లను జర్మనీ పత్రిక హంబర్గర్ మెర్గాన్ పోస్ట్ పత్రిక తన పత్రికలో మరోమారు ప్రచురించేది. ఈ నేపథ్యంలో ఇద్దరు అగంతకులు పత్రిక ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడిలో కొన్ని పత్రాలు ధ్వంసమయ్యాయి. ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hamburger Morgenpost  German paper  Charlie Hebdo  

Other Articles