Delhi assembly elections to be held on february 7

Delhi Assembly elections, Delhi Assembly elections on february 7, Delhi Assembly elections counting on february 10, Aam Aadmi party, Bharatiya janatha party, congress party, chief election commissioner, Chief Election Commissioner, VS Sampath, Delhi Assembly elections shedule released, Delhi Assembly elections notification on january 14, Delhi elections nominations last date january 21, Delhi elections withdrawls january 24,

The Assembly elections in Delhi, where the BJP and the Aam Aadmi Party (AAP) are raring for another face off, will be held on February 7 and counting will be held on February 10.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మ్రోగిన నగరా..!

Posted: 01/12/2015 05:47 PM IST
Delhi assembly elections to be held on february 7

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శాసనసభలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 7న ఎన్నికలు జరుగనున్నాయి. ఈవీఎంలలో నిక్షిప్తమై వున్న ఓటరు తీర్పును, అభ్యర్థుల భవితవ్యాన్ని ఫిబ్రవరి 10 ఓట్ల లెక్కింపుతో తేలనుంది. ఢిల్లీలో మొత్తం కోటీ 30 లక్షల మంది ఓటర్లు ఉండటంతో.. వారి కోసం కేంద్ర పాలిత ప్రాంతంలో 17,763 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. తక్షణం ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల ప్రధానాధికారి సంపత్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ నెల 15న 65వ ఒడిలోకి చేరుకోనున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ విఎస్ సంపత్ అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన, ప్రధాన ఎన్నికల కమీషనర్ గా ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు. ఎన్నికలను సజావుగా సాగేందుకు ఇప్పటికే ఢిల్లీలో వున్న 100 కేంద్ర పారా మిలటరీ దళాలు బందోబస్తు ఏర్పాట్లు చూసుకుంటాయని ఆయన చెప్పారు. వీటి సాయంతో ఢిల్లీలో స్వేచ్ఛా ఎన్నికల వాతవరణం కల్పిస్తామన్నారు.

జన్ లోక్ పాల్ బిల్లును డిమాండ్ చేస్తూ.. తన 49 రోజుల ప్రభుత్వ పాలనకు అమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో.. గత ఏడాది కాలంగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 2013 ఎన్నికలలో బీజేపి 31 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 28 మంది ఎమ్మెల్యేలతో ఆప్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, కాంగ్రెస్ 8 స్థానాలను, జేడీయూ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

  • ఫిబ్రవరి 7న దిల్లీ శాసనసభ ఎన్నికలు
  • జనవరి 14న దిల్లీ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ జనవరి 21.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 24.
  • ఫిబ్రవరి 7న పోలింగ్
  • ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Assembly elections  February 7  Election commision of india  

Other Articles