John kerry unhurt after india car accident

U.S. Secretary of State John Kerry, American secratary of state John kerry, john kerry vehicle met with accident, John Kerry unhurt after car accident, john kerry car in minor accident, john kerry met with accident in india,

U.S. Secretary of State John Kerry emerged unscathed after his motorcade was involved in a minor car accident in India.

స్వదేశానికి తిరిగి వెళ్తూ.. ప్రమాదానికి గురైయ్యారు..

Posted: 01/12/2015 07:23 PM IST
John kerry unhurt after india car accident

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ ప్రమాదానికి గురైంది. అత్యంత భద్రతల నడుమ వస్తున్న ఆయన కాన్వాయ్ లో ప్రమాదం సంభవించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో పాల్గోని ప్రధాని మోఢీపై ప్రశంసల జల్లు కురిపించిన జాన్ కెర్రీ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యారు. సదస్సులో పాల్గొని అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు విమానాశ్రయానికి బయలుదేరిన జాన్ కెర్రీ వాహన శ్రేణిలో వాహనాలు ఢి కోన్నాయి. అయితే ప్రమాదానికి గురైన తొలి వాహనంలోనే జాన్ కెర్రీ ప్రయాణిస్తున్నారు.

ఈ ప్రమాదంలో జాన్ కెర్రీ ప్రయాణిస్తున్న కారుతో పాటు మరో కారు స్వల్పంగా ధ్వంసమయ్యాయని గుజరాత్ ప్రభుత్వ అధికార ప్రతనిధిరాలు జెన్ పి సాకీ తెలిపారు. జాన్ కెర్రీ ఎలాంటి గాయాలు కాలేదని అతనితో పాటు ఆయన సిబ్బంది కూడా ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ప్రమాదానికి కారణమన వాహనాన్ని అక్కడే నిలిపివేసి.. ఇతర వాహనాల శ్రేణితో కెర్రీ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U.S  Secretary of State  John Kerry  accident  

Other Articles