Directi launches voice app ringo allows to make overseas calls without internet

worldwide leader, unitedstates, United Kingdom, Tech Solutions, Skype, serial entrepreneur, Sanchit Vir Gogia founder CEO, Networks, net worth, Mumbaibased, Malaysia, M&A, KPMG, Jaideep Ghosh, IOS, Insurability, Google, Facebook, Endurance, International Group, domain name registrar, Directi, canada, Bhavin Turakhia, android, Smart International Calling App, Ringo, WiFi, overseas calls without Internet, overseas calls without Wi-Fi, overseas calls without carrier minutes, 70% lower rates than mobile companies, credit based Skype calls, credit based Viber calls, Directi founder Bhavin Turakhia.

Directi has launched an app, Ringo, which allows users to make overseas calls without the Internet, Wi-Fi

నెట్, వై ఫై లేకుండానే విదేశాలకు చౌకగా కాల్స్..!

Posted: 01/15/2015 01:13 PM IST
Directi launches voice app ringo allows to make overseas calls without internet

రింగో... స్మార్ట్ ఇంటర్‌నేషనల్ కాలింగ్ యాప్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్‌తో ఇంటర్‌నెట్, వైఫై లేకుండానే ఇంటర్‌నేషనల్‌ కాల్స్ చేసుకోవచ్చు. 16 దేశాల్లో విజయవంతమైన ఈ యాప్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్ కారణంగా ఇంటర్నేషనల్ కాలింగ్‌లో 90% పొదుపు చేయవచ్చు. తమ రింగో యాప్‌తో ప్రపంచంతో భారతీయుల కమ్యూనికేషన్ విషయంలో పెనుమార్పు వస్తుందన్న ధీమాను రింగో సీఈఓ భవిన్ తురకియా వ్యక్తం చేశారు.

ఇతర ఓటీటీ వాయిస్ యాప్‌ల వలె రింగో కాల్స్‌కు ఇంటర్నెట్, వైఫై, డేటా  అవసరం లేదని వివరించారు. భారత్‌లోని రింగో యూజర్, ఇంగ్లాండ్‌లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో భారత యూజర్‌కు లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్‌లోని యూజర్‌కు కూడా లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. ఈ ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం చేస్తుందని వివరించారు.  ఏడాదికి భారతీయులు 200 కోట్ల డాలర్లు విదేశీ కాల్స్ కోసం వెచ్చిస్తున్నారని భవిన్ పేర్కొన్నారు. తమ సంస్థ అందజేస్తున్న కాల్ చార్జీలు మిగతా మొబైల్ పోన్ల కంటే 70 శాతం చౌకని తెలిపారు. ఇంటెర్ నెట్ ఆధారిత  స్కైప్, వైబర్‌తో పోల్చితే 25% తక్కువని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smart International Calling App  Ringo  WiFi  Directi  Internet  

Other Articles