H s brahma takes charge as chief election commissioner

Election Commissioner, Hari Shankar Brahma, HS Brahma takes charge as CEC, HS Brahma elevated as CEC, V S Sampath, new Chief Election Commissioner, HS Brahma assumes charge, Union Law Ministry, three-member body., Government to fill vacancy in body., AP 1975-batch IAS officer cadre, Brahma hails from Assam, former Union Power Secretary, J M Lyndogh, second northeast officer in CEC,

Hari Shankar Brahma today has taken charge of Chief Election Commissioner.

నకిలీ ఓటర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగిస్తాం

Posted: 01/16/2015 05:34 PM IST
H s brahma takes charge as chief election commissioner

నకిలీ ఓటర్లను తాజా ఎన్నికల జాబితా నుంచి తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ తెలిపారు. న్యూఢిల్లీలోని నిర్వాచన సదన్లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రహ్మ ఓటర్ల జాబితాను పటిష్ట పరిచేందుకు ఏడాదిలో చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.  అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న విఎస్ సంపత్ గురువారం పదవి విమరణ చేశారు.

దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్గా హెచ్ ఎస్ బ్రహ్మను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. సంపత్ కూడా 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి కావడం విశేషం. గతంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా కొనసాగిన జేఎం లింగ్డో తర్వాత ఈశాన్య రాష్ట్రాల నుంచి కీలకమైన పదవి చేపట్టనున్న రెండో వ్యక్తిగా బ్రహ్మ మారారు.  అయితే బ్రహ్మ పదోన్నతి నేపథ్యంలో మగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ ఏర్పడటంతో కేంద్రం ఆ స్థానాన్ని మరో సీనియర్ అధికారితో భర్తీ చేయనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : H S Brahma  Chief Election Commissioner  Union Law Ministry  charge  

Other Articles