Air india pilot assaults flight engineer derostered

India pilot assaults flight engineer, Air India pilot, pilot derostered in Chennai Airport., air india, assault, Chennai Airport, flight-engineer fight, pilot, cockpit, pilot, engineer, air india plane

Air India is embroiled in yet another controversy as reports emerged that a pilot from the airline had attacked a flight engineer at the

పోలీసుల అదుపులో ఎయిరిండియా పైలట్..

Posted: 01/17/2015 02:52 PM IST
Air india pilot assaults flight engineer derostered

వారిద్దరు ఉన్నత విద్యావంతులు. అందుకు అనుగూణంగా ఉద్యోగాలను సంపాదించారు. ఉద్యోగ రిత్యా ఎక్కడ ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా తెలుసు అయినా తామెక్కడ వున్నామన్న విషయాన్ని మర్చి అహంకారంతో వాదులాడారు. అంతటితో అగకుండా తన్నుకున్నారు. చెన్నై- ప్యారిస్ ఎయిర్ ఇండియా విమానం కాక్ పిట్లో ఇంజినీర్పై పైలట్ దాడి చేశారు. దాంతో ఆ ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంజినీర్ను ఎయిర్పోర్ట్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పైలట్ను ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం చెన్నై ఎయిర్ పోర్ట్లో చోటు చేసుకుంది.

ఇరువురి మధ్య ఘర్షణకు దారి తీసిన వైనం మాత్రం తెలియరాలేదు. పైలట్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంజినీర్పై దాడికి నిరసనగా ఎయిర్ ఇండియా ఇంజినీర్లు ఎయిర్పోర్ట్ లో ఆందోళనకు దిగారు. దాంతో చెన్నై - ప్యారిస్ విమానం బయలుదేరకుండా ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంజినీర్ పై పైలట్ దాడిపై విచారణకు ఎయిర్ ఇండియా ఆదేశించింది. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india  assault  Chennai Airport  flight-engineer fight  

Other Articles