Nandamuri kalyan ram pataas movie censor a certificate

kalyan ram pataas movie, pataas movie censor certificate, pataas censor board, pataas movie updates, pataas movie news, kalyan ram pataas movie news, pataas movie release date, pataas movie review, pataas movie telugu review, pataas censor certificate

nandamuri kalyan ram pataas movie censor A certificatate : censor board has given a certificate for kalyan ram's pataas movie. they cut lots of scenes and dialogues which are majority.

సెన్సార్ టాక్: ‘పటాస్’లో అంతగా ‘A’ముందో..?

Posted: 01/19/2015 07:24 PM IST
Nandamuri kalyan ram pataas movie censor a certificate

నందమూరి వారసుడు కళ్యాణ్’రామ్ స్వయంగా నిర్మిస్తూ హీరోగా తెరకెక్కించిన ‘పటాస్’ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే! అయితే ఇండస్ట్రీ ఫార్మాలిటీస్ ప్రకారం.. ఈ చిత్రం కూడా సెన్సార్ సర్టిఫికెట్ పొందాల్సిందే కాబట్టి దీనిని బోర్డులో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ అధికారులు.. ఇందులో వున్న అన్ని అసభ్యకర సన్నివేశాలను కట్ చేసిన తర్వాత కూడా 18 సంవత్సరాల వయస్సులోపు వున్నవారందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీని చూడలేరంటూ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం! ముఖ్యంగా పిల్లలు చూడకూడదనే కండిషన్ సెన్సార్ పెట్టిందని అంటున్నారు.

ఈ చిత్రంలో కొన్ని మెజారిటీ డైలాగ్స్ వున్నాయని, అయితే వాటిని ఇప్పటికిప్పుడే మార్చడం అంత సులువు కాదు కాబట్టి.. ఆయా డైలాగ్స్ వచ్చిన సమయంలో ‘మ్యూట్’ (మాటలు వినిపంచకుండా) చేయాల్సిందిగా సెన్సార్ సూచనలు ఇచ్చిందట! ఇక కల్యాన్ రామ్ పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి.. ఈ చిత్రంలో పాలిటిక్స్ సంబంధించిన డైలాగులు, సన్నివేశాలు వుండకూడదంటూ తేల్చి చెప్పింది. ఇందుకు యూనిట్ బృందం కూడా సరేనన్నట్లు సమాచారం. అయితే ఇందులో వున్న కొన్ని గ్లామర్-సెక్సీ సన్నివేశాలను తీయకుండా యధాతథంగా వుంచాలంటూ ప్రొడ్యూసర్ కోరడంతో.. సెన్సార్ అందుకు అంగీకరించి చివరికి ‘ A’ సర్టిఫికెట్ ఇచ్చింది.

ఇదిలావుండగా.. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా సందర్భంగా జనవరి 14వ తేదీనే రిలీజ్ చేయాల్సి వుండేది. కానీ.. అప్పుడు ఒకేసారి రెండు భారీ చిత్రాలు రావడంతో థియేటర్ల సర్దుబాటు కాదనుకుని భావించిన కల్యాణ్.. ఇలా 23వ తేదీన రిలీజ్’ని పోస్ట్’పోన్ చేసుకున్నాడు. సుమారు 700 థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై కల్యాణ్ రామ్ హిట్ అవుతుందని చాలానే ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ప్రేక్షకులు కల్యాణ్ మూవీని ఏ విధంగా ఆదరిస్తారో వేచి చూడాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyan ram pataas movie  pataas censor certificate  telugu movies  

Other Articles