Actor ms narayana hospitalized with malaria

MS Narayana, MS Narayana ill, MS Narayana serious ill, MS Narayana malaria disease, MS Narayana hospitalized, MS Narayana joins in kims, MS Narayana suffers with malaria, MS Narayana movies, MS Narayana comedy videos, tollywood updates

Actor MS Narayana serious ill admits in Hyderabad hospital : Vetaran actor MS Narayana seriously ill with malaria joined in Kondapur KIMS hospital. tollywood industry hopes MS Narayana will recover soon

ఎంఎస్ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

Posted: 01/20/2015 09:03 AM IST
Actor ms narayana hospitalized with malaria

ప్రముఖ నటుడు ఎంఎస్ నారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. సంక్రాంతి సంబరాలైన కోడి పందాలను చూసేందుకు  పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు వెళ్లిన నారాయణ, అక్కడ సరైన నాణ్యత లేని ఆహారం తీసుకోవటంతో పుడ్ పాయిజన్ అయింది. స్థానిక ఆస్పత్రిలో చేరగా నారాయణకు మలేరియా వచ్చినట్లు వైద్యులు దృవీకరించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కిమ్స్ వైద్యులు నారాయణకు ఎమర్జెన్సి సేవలు అందిస్తున్నారు.

మలేరియాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష్క్షన్ తో బాధపడుతున్నట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో నారాయణ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మంచి నటుడిగా, మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న నారాయణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నారాయణ అనారోగ్యంతో ఉన్నా ఆందోళన చెందనవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన త్వరలోనే కిమ్స్ వైద్యులు కోలుకుంటారని భరోసా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Narayana  Kims Hospital  Malaria  

Other Articles