Supreme court grants conditional bail to gali janardhan reddy

Gali Janardhana Raddy, former minister, obulapuram illegal mining case, Supreme Court, OMC illegal mining case, bail deal case, BJP leader, ballary, kadapa, gali janardhan reddy passport, bangaluru, parappana agrahara jail, cbi,

Gali Janardhana Raddy who was jailed in illegal mining case has finally succeeded in getting bail from the Supreme Court on Tuesday January 20.

ఎట్టకేలకు ‘గాలి’కి స్వేచ్ఛ..సుప్రీంకోర్టు కరుణించింది..

Posted: 01/20/2015 01:32 PM IST
Supreme court grants conditional bail to gali janardhan reddy

ఓబులాపురం మైనింగ్ కేసులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.  బెయిల్ మంజూరుకు సీబీఐ అభ్యంతరం తెలపకపోవటంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే ఆరు కేసులలో బెయిల్ పోందిన గాలి జనార్థన్ రెడ్డి.. ఓబులాపురం మైనింగ్ కేసులోనూ బెయిల్ పొందడంతో గత  మూడు సంవత్సరాల నాలుగు  నెలలుగా జైలు గోడల మధ్య వున్న ఆయన త్వరలోనే స్వేచ్చా వాయువును పీల్చనున్నారు.

కాగా గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సీబిఐ నుంచి అభ్యంతరాలు తలెత్తకపోవడంతో.. బెయిల్ మంజూరు చేసింది. కాగా, అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా.. గాలి జనార్థన్ రెడ్డి బళ్లారి వెళ్లకుండా చూడాలని సిబీఐ తన అఫిడవిట్ లో పేర్కోనడంతో.. వాటిని పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు షరతులను విధించింది. బళ్లారి సహా విదేశాలకు కూడా వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. తన పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని సూచించింది.

బెయిల్ నిమిత్తం 30 లక్షల రూపాయల పూచికత్తు సమర్పించాలని గాలిని న్యాయస్థానం అదేశించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 2011 సెప్టెంబర్ 4న జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయగా ఆయన అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.   ఏడు కేసుల్లోనూ గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావటంతో త్వరలో  జైలు నుంచి విడుదల కానున్నారు.  ప్రస్తుతం ఆయన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. కాగా న్యాయస్థానం నుంచి బెయిల్ ఆర్డర్లు వచ్చిన తరువాత వాటిని తీసుకుని బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు అధికారులకు అందించేందుకు సమయం పట్టనుండటంతో గాలి జనార్థన్ రెడ్డి రేపు విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan Reddy  OMC case  Bail  supreme court  

Other Articles