ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఫిక్సింగ్‌కు శ్రీనివాసన్ పాల్పడినట్లు రుజువుల్లేవని పేర్కన్న న్యాయస్థానం.. అతనికి క్లీన్ చిట్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. ఐఫీఎల్ ఫ్రాంచైజీ, లేదా బీసీసీఐ బోర్డు పదవిలో ఏదో ఒక దానిని మాత్రమే శ్రీనివాసన్ ఎన్నుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఇందుకు బిసిసిఐ నిబంధనల్లో వున్న 6.2.4 నిబంధనను కొట్టివేసింది. ఇది తేల్చుకునేవరకు ఆయన ఎన్నికలలో పోటీ చేయరాదని సుప్రీం ఆదేశించింది. ఆరు వారాల్లో బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. బీసీసీఐ సభ్యలు, అధికారులు ఎవ్వరూ ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనరాదని హెచ్చరించింది. బీసిసిఐతో పాటు ఐపీఎల్ లోని నిభంధనల్లో అత్యున్నత న్యాయస్థానం పలు సవరణలు చేసింది.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజ్ కుంద్రాలను సుప్రీంకోర్టు దోషులుగా నిర్ధారించింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడైన గురునాథ్ మెయప్పన్‌కు బెట్టింగ్తో సంబంధం ఉందని సర్వోన్నత న్యాయస్థానం నిర్థారించింది. గురునాథ్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు యజమానని, రాజ్‌కుంద్రా రాజస్థాన్ రాయల్స్‌కు సహ యజమానని తేల్చింది. వీరిద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను కమిటీ రుజువుచేసిందని న్యాయస్థానం తెలిపింది. శ్రీనివాసన్‌పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని, నిబంధనల మేరకే ముద్గల్ కమిటీ నివేదిక ఇచ్చిందని న్యాయస్థానం పేర్కొంది.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన గురునాథ్ మెయప్పన్, రాజ్ కుంద్రా భవిష్యత్తును నిర్ధారించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా సహా న్యాయమూర్తులు అశోక్ బాన్, ఆర్వీ రవీంద్రన్‌లతో కూడిన కమిటీని నియమించింది. జూన్ 2013 నాటి ఈ కేసులో దాదాపు 18 నెలల తర్వాత తీర్పు వెలువడింది. సర్వోన్నత న్యాయస్థానం 130 పేజీల తీర్పును వెలువరించింది. కాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిసిసిఐ స్పందించింది. సుప్రీం తీర్పు ఆటను మార్చేదిగా వుందంటూ హర్షం వ్యక్తం చేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more