Raghuveera reddy takes on venkaiah naidu

AP special status demand, venkaiah naidu, union minister venkaiah naidu, raghuveera reddy, ap pcc president, venkaiah naidu on special status, raghuveera questions venkaiah naidu, raghuveera questions special status, raghuveera critises venkaiah naidu,

ap pcc chief raghuveera reddy takes on venkaiah naidu on andhrapradesh special status

వెంకయ్య తీరే.. బీజేపి ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం..

Posted: 01/25/2015 08:11 PM IST
Raghuveera reddy takes on venkaiah naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆయనపై విమర్శలను ఎక్కుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హెదా ఇవ్వాలని గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే మాట మార్చారని దుయ్యబట్టారు. ఆదివారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...  బీజేపీ ద్వంద్వ వైఖరీకి వెంకయ్యనాయుడి ధోరణే నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, ఇలాంటి నిబంధన పెట్టడానికి కాంగ్రెస్సె కారణమని వెంకయ్య చెప్పడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర విభజన వల్ల ఎలాంటి అన్యాయం జరగకూడదనే అప్పట్లో కేంద్రంలో వున్న తమ ప్రభుత్వం అనేక కేంద్ర సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని బిల్లులో పోందుపర్చారని తెలిపారు. తాము రూపొందిన ప్రకారమే రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటీ, ఐఐఐటీలతో పాటు అనేక కేంద్ర సంస్థలు వస్తాయని తెలిపారు. వాటిలో తాత్సారం చేయకుండా త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం అనుమతులు కష్టమని చెబుతున్న వెంకయ్యనాయుడు ... కృష్ణానది ఒడ్డున ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. ఉండవల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి శనివారం వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP special status demand  venkaiah naidu  raghuveera reddy  

Other Articles