Pawan kalyan controversial comments engineer students srikakulam rajam tour swachch bharat

pawan kalyan news, pawan kalyan latest news, pawan kalyan latest photos, pawan kalyan srikakulam tour, pawan kalyan rajam tour, pawan kalyan swachch bharat, pawan kalyan srikakulam rajam tour, pawan kalyan narendra modi

pawan kalyan controversial comments engineer students srikakulam rajam tour swachch bharat : tollywood power star pawan kalyan visits srikakulam rajam. After he visits said some controversial comments on students that they don't have power to question political leaders.

యువతలో దమ్ము తగ్గిందంటున్న పవన్..

Posted: 01/27/2015 04:24 PM IST
Pawan kalyan controversial comments engineer students srikakulam rajam tour swachch bharat

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యువతను దృష్టిలో పెట్టుకుని తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతలో పూర్తిగా దమ్ము తగ్గింది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా రాజం పర్యటనలో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విధంగా ఆయన అన్నారు.

మంగళవారం (27-01-2015) ఉదయం శ్రీకాకుళం జిల్లా రాజం పర్యటనకు పవన్ బయలుదేరిన సంగతి తెలిసిందే! అక్కడికి చేరుకున్న అనంతరం ఆయన ఇంజనీరింగ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన.. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులను నిలదీసి ప్రశ్నించే దమ్ము యువతలో తగ్గిందని ఆగ్రహంగా తెలిపారు. ఉమ్మడిగా వుండే రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కారణం కూడా యువతతే అన్నట్లుగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేవలం ఒక్క తరం చేసిన తప్పుతో రాష్ట్రం రెండు ముక్కలు అయిందని విమర్శించిన పవన్.. యువత ప్రశ్నించకపోవడం వల్లే ఈ పరిస్థితి సంభవించిందని వెల్లడించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే వుందని, అందరూ చైతన్యంతో ముందడుగు వేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan swachch bharat  pawan kalyan srikakulam tour  

Other Articles