Husband put wifes photography mobile number callgirls website hyderabad dowry case

hyderabad dowry case, hyderabad crime news, husband murali, husband wife callgirl websites, callgirls websites, husband wife clashes, dowry cases, cyberabad police station, hyderabad police station, husband murali put wife photo callgirl site

husband put wifes photography mobile number callgirls website hyderabad dowry case : A husband names murali has put his wife's photograph and mobile number on callgirls website for complaining on him dowry case.

వరకట్న వేధింపుల కేసు : కాల్-గర్ల్స్ సైట్-లో భార్య ఫోటో!

Posted: 01/29/2015 12:20 PM IST
Husband put wifes photography mobile number callgirls website hyderabad dowry case

ఈమధ్యకాలంలో వరకట్న వేధింపులు కేసులు మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఓవైపు దేశంలో మహిళాబలం పెరుగుతుంటే.. మరోవైపు వారిని స్వేచ్ఛను అణిచివేసే కీచకులు అంతకంటే రెట్టింపుగా పుట్టుకొస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు, ఆకృత్యాలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. పెళ్లికాకముందు కీచకులు వెంటపడి వేధిస్తుంటే.. పెళ్లైన తర్వాత భర్తలే రావణాసురుడిలాగా అధికారం చెలాయిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వరకట్న వేధింపుల కేసు నమోదైంది.

పెళ్లైన కొన్నాళ్ల నుంచే అదనపు కట్నం ఓ కీచక భర్త ప్రతిరోజు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అయితే.. అతని ఆకృత్యాలు రానురాను మరింతగా పెరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు ఇల్లాలు.. అతనిపై కేసు పెట్టింది. దాంతో తనపై కేసు పెట్టిందన్న కసితో ఆ భర్త.. తన భార్యపై వ్యభిచారిని అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే అతగాడు తన భార్య ఫోటోతోపాటు ఫోన్ నెంబర్’ను కాల్ గర్ల్స్’కు సంబంధించిన ఓ వైబ్’సైట్’లో పొందుపరిచాడు. ఈ విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయిన బాధిత మహిళ మరోసారి పోలీసులు గడప తొక్కక తప్పలేదు. హైదరాబాదులోని సైబరాబాదులో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని సైబరాబాదుకు చెందిన మురళి అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మురళి దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అప్పటివరకు సాఫీగానే జీవితం కొనసాగిస్తుండగా.. కొన్నాళ్ల నుంచి మురళి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అందుకు నిరాకరించిన తన భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఇటీవలే చిత్రహింసలకూ తెరతీశాడు. దీంతో అతడి పెట్టే వేధింపులకు తాళలేకపోయిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించి అతడిపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. అనంతరం ఆమె తన పుట్టిల్లుకి చేరి, అక్కడే వుండిపోయింది.

అయితే.. భార్య తనమీద వరకట్న వేధింపుల కేసు పెట్టిందనే కసితో మురళి చివరకు తన పైశాచికత్వాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఆమెపై వ్యభిచారిగా ముద్రవేయాలని నిర్ణయించుకున్న అతగాడు.. ఆమె ఫోటోతోపాటు ఫోన్ నెంబరును ఓ కాల్ గర్ల్స్ సైట్’లో పొందుపరిచాడు. దీంతో ఆమె తరుచుగా ఫోన్లు రావడంతో అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు.. మరోసారి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad dowry case  husband murali callgirls website  

Other Articles