Aam aadmi party leader manish sisodia complaints kiran bedi bribe case

aam aadmi party news, manish sisodia news, kiran bedi news, kiran bedi bribe case, delhi assembly elections, kiran bedi crime news, manish sisodia bjp party, arvind kejriwal news

aam aadmi party leader manish sisodia complaints kiran bedi bribe case : aam aadmi party leader manish sisodia files complaint on kiran bedi for giving bribe to delhi voters.

ఓటర్లకు లంచాలు ఇస్తున్న కిరణ్ బేడీ..

Posted: 01/30/2015 04:50 PM IST
Aam aadmi party leader manish sisodia complaints kiran bedi bribe case

బీజేపీ సీఎం అభ్యర్థిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీబరిలో వున్న కిరణ్ బేడీ.. ‘లంచం’ వివాదంలో చిక్కుకుపోయారు. ఒకప్పటి పవర్’పుల్ పోలీస్ అధికారి అయిన ఈమె.. నిత్యం న్యాయం కోసం పోరాటం జరిపేది. అటువంటి ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి రాగానే అవినీతిని మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నికల ప్రచార సందర్భంలో ఓ మహిళకు నెక్లెస్ ఇస్తూ పట్టుబడిందని కొందరు పిర్యాదు చేశారు.

అయితే.. ఈ ఫిర్యాదు చేసింది మరెవ్వరో కాదు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’! ఎన్నికల ప్రచారనేపథ్యంలో ఆమె ఓ మహిళలకు ముత్యాల నెక్లెస్ ఇస్తూ కనిపించిందని ఆరోపించిన ఆప్.. కిరణ్ ఓటర్లకు లంచాలు ఇస్తూ మభ్యపెడుతున్నారని పేర్కొంది. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ నియోజకవర్గంలో జరిగిందని వారంటున్నారు. ఢిల్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఇప్పటినుంచే ఓటర్లను డబ్బులతో కొనేస్తున్నారని ‘ఆప్’ నేత మనీష్ సిసొడియా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘కిరణ్ బేడీ, బీజేపీ పార్టీ ప్రత్యక్షంగా నెక్లెస్’లు ఇస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. బీజేపీ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది’’ అంటూ ఆయన ఆరోపణలు చేశారు. మరి.. ఇతర పార్టీలు ఇచ్చే బహుమతులు తీసుకుని, ఓటు మాత్రంతమ పార్టీకే వేయాలని చెప్పిన కేజ్రీవాల్’ని ఏ విధంగా ట్రీట్ చేయాలంటూ కొందరు వాదనలు వినిపిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles