Bjp promises to make delhi a world class city

bjp, vision document, new delhi, delhi assembly elections 2015, kiran bedi, arvind kejriwal, BJP Vision Document, Bharatiya Janata Party, prime minister modi, narendra modi, amit shah, bjp president amit shah,

The Bharatiya Janata Party has just released its Vision Document for Delhi ahead of the Delhi Assembly Elections 2015

విశ్వశ్రేణి నగరంలా ఢిల్లీ.. విజన్ డాక్యుమెంట్ లో బీజేపి హామి

Posted: 02/03/2015 06:32 PM IST
Bjp promises to make delhi a world class city

మరో నాలుగు రోజుల్లో (ఫిబ్రవరి 7న) జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మంగళవారం విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఢిల్లీని విశ్వశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని హామీయిచ్చింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ విజన్ డాక్యూమెంట్ ను విడుదల చేసింది. ఢిల్లీలో నెలకొన్న పరిస్ధితులను ఎదుర్కొనే రీతిలో రోడ్ మ్యాప్ ప్రకటిస్తూ ఈ మేరకు విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. పారదర్శక పాలన అందిస్తామని, మహిళా భద్రతకు పెద్దపీట ఇస్తామని పేర్కొంది.

మొత్తం 270 అంశాలతో ఈ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ ఢిల్లీని ప్రపంచ స్థాయి సిటీగా తీర్చిదిద్దే దిశగా బీజేపీ పరిపాలన ఉంటుందని అన్నారు. అయితే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశం విజన్ డాక్యుమెంట్ లో ఎక్కడా లేదు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని 2013, గత ఎన్నికల్లో బీజేపీ హామీయిచ్చింది. సమగ్రాభివృద్ధి, మహిళా భద్రత, ఢిల్లీని ప్రపంచశ్రేణి నగరం తీర్చిదిద్దడం తమ ప్రాధాన్యాలని బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు.

విజన్ డాక్యుమెంట్‌లో ముఖ్యాంశాలు:

* ఢిల్లీని ప్రపంచ స్ధాయి నగరంగా అభివృద్ధి చేయడం

* రాజధాని నగరంలో మహిళల భద్రత పెంపు

* రాజధాని యువతకు ఉపాధి అవకాశాల కల్పన

* పర్యావరణం, విద్యుతు త్రాగునీరు తదితర సమస్యలపై పరిష్కారానికి కృషి

* బీజేపీ ఢిల్లీ ప్రజల కలలను సాకారం చేస్తుంది

* నిపుణుల సలహా మండలి

* శాసనసభ్యులు కోసం కొలమానాలు

* ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని పారద్రోలడం

* డిజిటల్ ఇండియా - ఆన్‌లైన్, మొబైల్ టెక్నాలజీని ఉపయోగించడం

* ప్రాజెక్టుల్లో ప్రభుత్వ జోక్యం

* 24 గంటలు విద్యుత్, నీటి సరఫరా, నగరంలో రోడ్ల అభివృద్ధి

* ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు

* ప్రతి నెలా రేడియో ప్రసంగం "మన్ కీ బాత్"

* ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం

* ఈ విజన్ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశం ఢిల్లీని ప్రపంచ స్ధాయి సిటీగా తీర్చిదిద్దడం

* ఢిల్లీని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు హామీ

* కల్చరల్ హేరిటేజ్‌ని సంరక్షించడంతో పాటు ప్రదర్శించడం

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi assembly election 2015  BJP Vision Document  vision document  

Other Articles