Andhra pradesh capital region farmers pawan kalyan meeting ap government

andhra pradesh state news, pawan kalyan news, pawan kalyan gossips, pawan kalyan latest news, pawan kalyan ap capital news, pawan kalyan photos, pawan kalyan politics, pawan kalyan movies, pawan kalyan andhra pradesh, pawan kalyan janasena, pawan kalyan farmers, pawan kalyan, ap capital city news, ap capital region farmers

andhra pradesh capital region farmers pawan kalyan meeting ap government : In the recent days.. the capital region farmers of ap met with pawan kalyan to response on government behaviour.

ఆంధ్రరాష్ట్ర రాజధానిపై ‘పవన్ ప్రశ్న’?

Posted: 02/04/2015 01:14 PM IST
Andhra pradesh capital region farmers pawan kalyan meeting ap government

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికార టీడీపీ పార్టీ ఆ రాష్ట్ర రాజధాని కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే! గుంటూరు పరిసర ప్రాంతాలన్నింటిని కలిపి సుమారు 53 కి.మీ. మేర రాజధాని నిర్మాణం వుంటుందని బాబు ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వాధికారులు అందుకు కావలసిన స్థలాలను కేటాయించే పనిలో నిమగ్నమైపోయారు. కొందరు రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా వుండగా.. మరికొంతమంది మాత్ర భూములే తమ భవిష్యత్తు అంటూ వాటిని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం వారికి సంక్షేమం కల్పిస్తామని ఎన్ని హామీలిచ్చినప్పటికీ.. సదరు రైతులు అంగీకరించడం లేదు. దీంతో ఆ రైతులకు, అధికారుల ఘర్షణలు చోటు చేసుకున్నాయని సమాచారం!

ఇందులో భాగంగానే కొందరు రైతులు తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము భూములు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వబోమని, అవే మనకు జీవనాధారమని చెప్పినా.. అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై తమ ఆవేదనను జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందు కూడా వుంచుతున్నారు. తమ భూముల్ని ఇవ్వమని చెప్పినా ప్రభుత్వం మాత్రం వాటిని స్వాధీనం చేసుకుంటోందని, అలా జరగకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ కొందరు రాజధాని ప్రాంత రైతులు పవన్’ను కలిసి విన్నవించారని సమాచారం! ‘‘ఎవరికైనా అన్యాయం జరిగితే వారి తరఫున ప్రభుత్వానికి ప్రశ్నించేందుకు నేను ముందుంటాను’’ అని ఆనాడు పవన్ అన్న మాటలను ఈ రైతులు ఆయనకు గుర్తు చేస్తూ.. ఇప్పుడు అధికార పార్టీపై ప్రశ్నించాలంటూ కోరారని తెలుస్తోంది.

గతేడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం విదితమే! ఆయన చెప్పినట్లుగానే తమకు ఆ పార్టీ మేలు చేస్తాయనే నమ్మకంతో ఓటు వేశామని.. కానీ ప్రస్తుతం అధికార పార్టీ భూముల కోసం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని.. వాటిపై స్పందించాలంటూ రైతులు పవన్’ను కోరారట! ఈ నేపథ్యంలోనే ప్రజలు.. ‘‘అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తానని చెప్పిన మీరు.. ఇప్పుడు రాజధాని విషయంలో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై ఎందుకు ప్రశ్నించడం లేదు..?’’ అంటూ ఆయన్ని ప్రశ్నించారు. ఇలా రైతులు చెప్పిన ఆవేదనను విన్న తర్వాత పవన్.. ప్రజల ఇబ్బందులపై సరైన సమయంలో స్పందిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

పవన్ ను కలిసి రైతుల్లో యర్రబాలెం, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు వున్నారని సమాచారం! రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న భూముల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ... తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ద్వారా హామీ ఇప్పించాలంటూ కోరారని తెలిసింది. ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యపై త్వరలోనే ప్రాంతాలవారీగా సదస్సులు నిర్వహించినట్లు వార్తలొస్తున్నాయి. మరి.. ఇందులో పవన్ ఎటువంటి ప్రశ్న ప్రభుత్వం ముందు పెడతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles