Chakri brother mahith narayana complaints another time chakris wife sravani

chakri death news, chakri wife sravani, chakri family members, chakri brother mahith narayana, chakri mother, chakri wife sravani controversy, chakri family controversy, chakri death analysis, chakri forensic reports, chakri assets case, chakri music studio, sravani latest news, chakri wife sravani latest news

chakri brother mahith narayana complaints another time chakris wife sravani : tollywood music director chakri brother files complaint on his sister in law in banjarahills police station.

కొనసాగుతున్న చక్రి ఫ్యామిలీ ‘వార్’.. వదినపై మరిది సవాల్!

Posted: 02/05/2015 06:20 PM IST
Chakri brother mahith narayana complaints another time chakris wife sravani

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మరణానంతరం అతని భార్య శ్రావణి, కుటుంబసభ్యులు (చక్రి తల్లి, సోదరుడు) మధ్య వివాదాలు రేగిన విషయం తెలిసిందే! మొదట చక్రికి చెందిన ఆస్తులు తమకే దక్కాలంటూ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అలాగే.. అతని మరణంపై అనుమానం వుందంటూ శ్రావణి తన అత్తింటివారిపై ఫిర్యాదుచేస్తే.. వాళ్లు కూడా ఆమెకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కారు. దీంతో అనుమానాస్పద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా.. చక్రిది సహజ మరణమని ఫోరెన్సిక్ రిపోర్టులు తేల్చేశాయి. దీంతో వీరి మధ్య వివాదాలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు కానీ.. రానురాను అవి మరింతగా ముదురుతున్నట్లు కనిపిస్తాయి.

ఇటీవల చక్రి స్టూడియోను ధ్వంసం చేశారంటూ మళ్లీ వీరిమధ్య రగడ మొదలయ్యింది. ఆ విషయంపై శ్రావణి, అత్తింటివారి మధ్య వాదోపవాదనలు కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ తన వదినపై సవాల్ విసురుతూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నయ్య చక్రి స్టూడియోలో తాను క్రియేట్ చేసుకున్న ట్యూన్స్ వున్నాయని పేర్కొన్న మహిత్.. తాళం వేసి వున్న స్టూడియోను తెరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కొన్ని సినిమాలకు పనిచేస్తున్నానని, అందుకు తాను ఇదివరకే తయారుచేసి పెట్టుకున్న ట్యూన్స్ అవసరమని తెలిపిన ఇతను.. స్టూడియోను తెరిపించాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు. మరి.. దీనిపై శ్రావణి ఎలా స్పందిస్తుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles