"ఏపికి చాలా అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి'' ఎన్నికల ముందు బీజేపీ మాటలు. "ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం చాలా కష్టం దానికి చాలా కారణాలు ఉన్నాయి"-అధికారంలోకి వచ్చాక బీజేపీ మాటలు. ఇలా ఒకే పార్టీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోంది. అధికారంలోకి వచ్చాక ఏపికి అన్ని రకాలుగా సహాయం చేస్తామని ఎన్నికల ర్యాలీల్లో బీజేపీ నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతోంది. ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఒరిస్సా, తమిళనాడు లాంటి చాలా రాష్ట్రాలు తమకూ ప్రత్యేక హోదా కావాలంటాయని బీజేపీ వాదన. కానీ అసలు కారణాలు మాత్రం వేరే అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ తన ప్రయోజనాలకు మాత్రమే విలువిస్తోందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పినట్లు రాష్ట్రానికి కావాలసిన ఆర్థిక, మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. కానీ ఇప్పుడు మాత్రం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఏపీకి ఎందకు ప్రత్యేక హోదా కల్పించడం కుదరదు ? కేంద్రంలో అప్పటికి అధికారంలో ఉన్న యుపిఎ సర్కార్ హామీలను బీజేపీ ఎందుకు పాటించడం లేదు? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హొదా కల్పించాలంటే అక్కడి ఆర్థిక, మౌలిక సౌకర్యాలు చాలా వెనకబడి ఉండాలి. రాష్ట్రం పూర్తి స్థాయిలో నష్టాల్లో మునిగి ఉండాలి. అలా ఉంటే అన్ని రాష్ట్రాల ఆమోదంతో ప్రణాళిక సంఘం తన ప్రతిపాదనను నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు పంపుతుంది. తర్వాత ఎన్.డి.సి అనుమతి ఒక్కటే తరువాయి.
ప్రత్యేక హోదా కల్పనకు కావలసిన అన్ని అర్హతలు ఏపికి ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అయినా కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని అనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రణాళిక సంఘం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రెండూ లేవు. కేవలం కేబినెట్ ముందుకు ప్రతిపాదన వస్తే చాలు, ఆమోద ముద్ర ఒక్కటే తరువాయి. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే అది చాలా సులభం. కానీ ప్రత్యేక హోదాపై మీన మేషాలు లెక్కిస్తు కాలయాపన చేస్తోంది కేంద్రం. విభజన ఫలితంగా తీవ్రంగా నష్టపోయిన ఏపికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. రాజధాని లేకుండా ఏర్పాటైన ఒకే రాష్ట్రం ఏపి. లోటు బడ్జెట్ తో తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపికి కేంద్రం చేయూత ఎంతో అవసరం.
ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. 14 ఏళ్ల కిందట ఉత్తరాఖండ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించింది. ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎక్కడా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ట్రం నుంచి డిమాండ్ చెయ్యలేదు. అయితే అప్పటి ముఖ్యమంత్రి నిత్యానందస్వామి ప్రత్యేకహోదా కావాలంటూ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కేసీ పంత్‌కు ఒక వినతిపత్రం పంపించారు. 2001 ఫిబ్రవరి 16న ఢిల్లీలో పంత్‌ను నిత్యానంద స్వామి కలిశారు. ఆ వెంటనే... ప్రత్యేక హోదా కల్పిస్తు పంత్ ప్రకటన చేశారు. కేసీ పంత్ కూడా ఉత్తరాఖండ్ వాసి కావటమే ఇందుకు ప్రధాన కారణమని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మరోవైపు తమకు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఒరిస్సా అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోకపోవటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేడీ తక్షణం కేంద్రం నుంచి వైదొలగాలని డిమాండ్లు వచ్చాయి. ఒక దశలో బీజేడీ సైతం ఒరిస్సా కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రం నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. అయితే ఒరిస్సాలోని వెనుకబడిన 8 జిల్లాలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
ప్రత్యేక హోదా కల్పనకు అనేక రకాల సాంకేతిక కారణాలు అడ్డువస్తున్నాయని అంటోంది కేంద్రం. నిజానికి ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం వల్ల పెద్దగా లాభం ఉండబోదని కేంద్రం భావిస్తన్నట్లుంది. ఒకవేళ ఏపికి ప్రత్యేక హోదా కల్పించినా , ఆ క్రెడిట్ చంద్రబాబుకు మాత్రమే వస్తుంది. ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తే బీహార్ వంటి రాష్ట్రల్లో బీజేపి పట్ల వ్యతిరేకత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైగా రానున్న బీహార్ ఎన్నికల్లో ఇదే అంశం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేంద్రం ఏపికి ప్రత్యేకం వర్తించే పరిస్థితులు లేవని చేతులెత్తింది.
తన మాటలతో ప్రతిపక్షాలను ఒక్కిరిబిక్కిరి చేస్తున్న వెంకయ్య నాయుడు ఏపి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏపికి తీరని అన్యాయం జరిగిందని, కాబట్టి ప్రత్యేక హోదా కల్పించాలని గొంతు చించుకున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా ప్రత్యేకంపై మాట మారుస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని.. ప్రత్యేకం అన్న మాట వచ్చిన వెంటనే ఒరిస్సా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీకి వస్తున్నాయని.. వాటితో ఇబ్బందని చెబుతున్నారు. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా..అన్నట్లు కేంద్రం కల్పించాలనుకుంటే ఎలాగైనా ప్రత్యేక హోదా కల్పిస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more