President pranab did not cast his vote

president pranab did not cast his vote, pranab mukharjee did not case his vote, to whom president vote, pranad visited polling booth, president pranab mukharjee, delhi elections, delhi assembly elections, delhi assembly polls counting, delhi assembly polls 2015, BJP, AAP, congress party, aravind kejriwal, narendra modi, kiran bedi, sonia gandhi, rahul gandhi, amit shah,

president pranab mukharjee visit the polling booth in the premises of president bhavan but he refrained from casting his vote

దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతే.. ఓటు వేయలేదు..

Posted: 02/07/2015 08:28 PM IST
President pranab did not cast his vote

ఎన్నికలలో నూటికి నూరు శాతం ఓటింగ్ రావాలని దేశ ప్రజలకు పిలునివ్వాల్సిన స్థానంలో వున్న వ్యక్తి అతను. మరోలా చెప్పాలంటే ఓటు హక్కు కాదు బాధ్యత కూడా అని తెలుసుకోవాలని వివరించాలతను. అయితే దేశ ప్రధమ పౌరుడి హోదాలో వుంటూ ఓటు హక్కును వినియోగించుకోకుండా యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేశారతను. దేశ ప్రజలు ఆ స్థాయి వ్యక్తుల అడుగుజాడల్లో నడవాలని అనుకుంటారు. కొందురు సీరియస్ గా ఫాలో అవుతుంటారు. అతనే మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పాల్సిన స్థాయిలో వుంటూ తానే ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎందుకో తెలుసా

 రాష్ట్రపతి, దేశాధ్యక్షుడిగా కొనసాగుతూ ఏ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వకూడదని ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే పోలింగ్ బూత్ లను సందర్శించిన ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయితే కేవలం పోలింగ్ బూత్ ను మాత్రమే సందర్శించి వెళ్లారు. ఈ మేరకు ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కోన్నారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ సెగ్మంట్ నుంచి స్వయంగా రాష్ట్రపతి కూతురు ఎన్నికల బరిలో నిలిచినా.. ఆయన ఓటు మాత్రం వేయలేదు. 2013 డిసెంబర్ జరిగిన ఢిల్లీ ఎన్నికలలోనూ రాష్ట్రపతి తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi assenbly election 2015  president pranab mukharjee  

Other Articles