Murali mohan sons house robbed again

murali mohan sons house robbed again, robbery twice in a week, maganti rammohan, second time robbery in maganti rammohan house, banjara hills ACP, banjara hills police,

second time robbery in murali mohan sons house, twice in a week

దొంగలకు టార్గెట్ గా మారిన ఆ ఇల్లు..

Posted: 02/08/2015 08:09 PM IST
Murali mohan sons house robbed again

రాజమండ్రి ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. వారంలో వరుసగా రెండు సార్లు తనయుడి ఇంట్లో చోరీ చేశారు. వరుసగా రెండుసార్లు దొంగతనం జరగడంతో విస్తుపోయిన మాగంటి రాంమోహ్మన్ పోలీసులను ఆశ్రయించారు. బంజారా హిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు, శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది.

ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగులోని రూ.6 లక్షల విలువైన నగలు, విదేశీ కరెన్సీ చోరీ జరిగింది. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే మళ్లీ ఖరీదైన టీవీని ఆగంతకులు దొంగిలించారంటూ రామ్మోహన్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఐ రాంబాబు ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఘటనా స్థలికి వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు కూడా వచ్చారు. ఇప్పటికే రామ్మోహన్ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు, డ్రైవర్‌తో పాటు ఏడుగురిని పోలీసులు విచారించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : murali mohan  tdp mp  robbery  

Other Articles