Chandrababu seeks special status to ap

chandrababu seeks special status to ap, andhrapradesh chief minister chandrababu, special status to ap, hudhud cyclone, revenue deficit in andhra pradesh, state bifurfication bill, chandrababu naidu, central government, babu pressurises center for special status,

andhrapradesh chief minister chandrababu naidu seeks special status to state

నవ్యాంధ్ర ప్రత్యేక ప్యాకేజీని అన్ని రాష్ట్రాలతో పొల్చవద్దు..

Posted: 02/09/2015 08:54 AM IST
Chandrababu seeks special status to ap

రాష్ట్ర విభజనతో పీకల్లోతు ద్రవ్య లోటులో కూరుకుపోయిన నవ్యాంధ్రను కేంద్రం విస్మరించడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా తాము రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న మనోవేదనను అర్థం చేసుకుని, అన్ని రంగాలలో రాష్ట్ర ప్రగతి సాధించేలా కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను కల్పించాలన్నారు. నవ్యాంధ్రలో నిధుల కొరత ఉందని.. పారిశ్రామికాభివృద్ధి కూడా జరగాల్సి ఉందన్నారు. వీటి కోసం కేంద్రం తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం లేనందున దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జనాభా 59:41 నిష్పతిలో ఉంటే.. కేంద్ర సాయం మాత్రం 48:52 నిష్పత్తిలో ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఇద్దరూ సమాన బలంతో ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలంగాణ 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించింది. మేం కూడా మంచి ఫిట్‌మెంట్‌తో ప్రకటించాల్సి ఉంది. కేంద్రానికి చెప్పాల్సిన విషయాలన్నీ సమావేశంలో విన్నవించామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తే.. తెలంగాణకు కూడా కల్పించాల్సి వుంటుందన్న కేంద్రం ఆలోచనలో పడిందన్నారు. ఏపీని అన్ని రాష్ట్రాలతో పోల్చవద్దని కూడా చెప్పామని చంద్రబాబు చెప్పారు.

విభజన సమయంలో కేంద్రం ఏమంది? రెవెన్యూలోటు భర్తీ చేస్తామంది.. కేంద్రానికి కూడా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ చమురు కారణంగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చి ఉంటుంది. కేంద్రం హామీ ఇచ్చింది కాబట్టి.. నిలబెట్టుకోవాలి. ఇక్కడ డబ్బు ఒక అంశం కాకూడదు..’ అని పేర్కొన్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌లా ఏపీని మోసం చేస్తోందా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ ‘ఇస్తామని చెబుతున్నారు కదా.. అప్పుడే ఎందుకు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు?..’ అంటూ ప్రశ్నించారు. ‘గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యాను.

నిన్ననే మాకు అజెండా అందినందున మా సలహాలు, సూచనలపై వివరంగా నోట్ పంపిస్తామని చెప్పాం. అయితే నాకు లభించిన నాలుగైదు నిమిషాల పాటు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాను. ప్రధానమంత్రి స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న నదులను తొలుత అనుసంధానం చేసి.. తరువాత నదుల వారీగా అనుసంధానం చేయాల్సి ఉందని కేంద్రం భావిస్తోంది. మేం కూడా రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన పథకాలను అమలుచేస్తున్నాం. కేంద్ర ప్రాధాన్యతలు, రాష్ట్ర ప్రాధాన్యతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి.

సమాఖ్య స్ఫూర్తికి అద్దం పట్టేలా మేం కొన్ని సూచనలు చేశాం. సబ్ కమిటీలు వేయాలని చెప్పాం. దానికి అనుగుణంగా 3 సబ్ కమిటీలు కూడా వేశారు. అలాగే రెండు టాస్క్‌ఫోర్స్ కమిటీలు కూడా వేస్తాం. రాష్ట్రాల అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం’ అని వివరించారు. నీతి ఆయోగ్‌లో చెప్పిన విషయాలను ఆర్థిక మంత్రితో వివరంగా చర్చిస్తానని, మళ్లీ రెండు మూడు రోజుల్లో వచ్చి ప్రధానమంత్రిని కలుస్తానని ఆయన తెలిపారు.
 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Andhra Pradesh  special status  

Other Articles