Chandrababu telangana tour

babu tour, babu warangal tour, ap cm chandra babu, ncbn telangana tour, ttdp

chandra babu telangana tour : ap cm chandra babu naidu commence a tour from hyderabad to warangal. trs and mrps leaders oppose the babu tour.

ఉద్రిక్తత మధ్య బాబు వరంగల్ యాత్ర

Posted: 02/12/2015 09:31 AM IST
Chandrababu telangana tour

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపడుతున్న మొదటి యాత్రపై టిఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మార్పియస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. తెలంగాణకు ఇంత అన్యాయం చేసిన చంద్రబాబు ఏం మొహం పెట్టుకొని తెలంగాణలో అడుగుపెడతారని టిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ మండలం హయగ్రీవాచారి కొండ వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సభా వేదికకు వెనకి నుండి నిప్పు పెట్టడంతో వేదిక పాక్షికంగా కాలిపోయింది. ఇక హైదరాబాద్ నుండి ర్యాలీగా బయలుదేరి వరంగల్ కు చేరుకుంటారు చంద్రబాబు. అయితే చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మార్పియస్, టిఆర్ఎస్ నాయకులు సిద్దమవుతున్నారు.

కాగా తెలంగాణ ఏర్పాటు తరువాత తెలుగు దేశంపార్టీ తరఫున చేపడుతున్న తొలి పర్యటన కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందు నుండి తెలుగుదేశం యాత్రను అడ్డుకుంటామని ప్రకటించిన తెరాస దానికి అన్ని రకాలుగా సిద్దమైందని సమాచారం. యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని, విద్యుత్ ను అడ్డుకున్నారని, ముందు వాటి వాటాను తేల్చి తరువాత యాత్ర గురించి ఆలోచించాలని మంత్రి కెటిఆర్ గతంలోనే ప్రకటించారు. ఇలా మొత్తానికి చంద్రబాబు యాత్ర తెలుగుదేశం నాయకులకు, టిఆర్ఎస్, ఎమ్మార్పియస్ నాయకులకు సవాలుగా మారింది. యాత్ర సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : babu tour  babu warangal tour  ap cm chandra babu  ncbn telangana tour  ttdp  

Other Articles