Bhanothu said that am the stuppid

khammam vaira mla, khammam, bhanothu, trs leader bhanothu

bhanothu said that yes am the stuppid : trs leader bhanothu madanlala sentenced sentational. he said that am the first dtupid to join in the trs from mother party ysrcp.

టిఆర్ఎస్ లోకి చేరిన మొదటి మూర్ఖుడిని నేనే..వైరా ఎమ్మెల్యే

Posted: 02/13/2015 08:07 AM IST
Bhanothu said that am the stuppid

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలో చేరిన తొలి మూర్ఖుడిని నేనే అంటూ చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఖమ్మం జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా టిఆర్ఎస్ కు చెందిన రెండు వర్గాల కార్యకర్తల మద్య చిన్న వివాదం తలెత్తింది. ఆ సందర్భంగా వైరా ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మనుగడ లేదని భావించి పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్ లో చేరానని అన్నారు. వైఎస్ఆర్ సిపిలో ఉన్నంత కాలం ఏ రోజూ అభాసుపాలు కాలేదని అసహనం వ్యక్తం చేశారు. "అవును నేను మూర్ఖుడినే, అయినా నలుగురు వ్యక్తులను వెంటేసుకొని ఇలా విమర్శలు చెయ్యడం తగదు" అంటూ గొడవకు దిగిన మరో వర్గం వారిపై మండిపడ్డారు. మొత్తానికి అలా బానోతు మదన్ లాల్ తన మాతృ పార్టీ నుండి వీడి రావడంపై తీవ్రంగా బాధపడుతున్నట్లున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khammam vaira mla  khammam  bhanothu  trs leader bhanothu  

Other Articles