Women journalists more suited for off field roles rajyavardhan singh rathore

women journalists more suited for off field roles, union minister rajyavardhan singh rathore, rajyavardhan singh controversial remaks, union minister contorversial remarks, rathiores Sexist remarks on women journos, Journalism, journalist, Rajyavardhan Singh Rathore, sexist, Women journalist, misquoted

women journalists more suited for off field roles rajyavardhan singh rathore

మహిళా జర్నలిస్టులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 02/14/2015 09:13 PM IST
Women journalists more suited for off field roles rajyavardhan singh rathore

మహిళలు రిపోర్టింగ్ తో ఏం పని.. వారు స్టూడియోలలోని జాబులను చూసుకోవచ్చు కదా అంటూ కొత్త వివాదానికి తెర తీశారు కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాధోడ్. మహిళా జర్నలిస్టులు రిపోర్టింగ్ మానేసి... వార్తా విశ్లేషణలకు పరిమితం కావాలంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు తల్లి, చెల్లి, భార్య పాత్రలకు పరిమితం కావాలంటూ సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారం చెలరేగింది. దీంతో ఆయన వెనక్కి తగ్గారు.  రిపోర్టింగ్ కోసం బయటకు వెళ్ళకుండా మీ సేవలు అందించవచ్చుకదా అని మాత్రమే తాను అన్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యాలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని మళ్లీ తప్పును మీడియాపై తోసారు.

ఆయినా ఆగకుండా తాను వ్యాఖ్యల ఉద్దేశం మహిళా జర్నలిస్టులు బయటకు వెళ్ళవద్దని కాదని... అంతకుమించి తల్లిగా, చెల్లిగా, భార్యగా బాధ్యతలను నెరవేర్చాల్సాలని ఉచిత సలహా ఇచ్చారు. మహిళా జర్నలిస్టులు సెక్యూరిటీ, పని గంటలు, రక్షణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, వార్తా విశ్లేషణ వంటి పనులకు పరిమితం కావాలన్నారు. మహిళలు రిపోర్టింగ్ వదిలేసి వార్తా విశ్లేషణలకు పరిమితం కావాలని తాను అనలేదన్నారు. తన వ్యాఖ్యలను మహిళా జర్నలిస్టులు అపార్థం  చేసుకున్నారని శనివారం ఉదయం ట్వీట్ చేశారు. తన భార్య ఒక మాజీ సైనికురాలు అని గుర్తు చేసిన ఆయన మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు తీసిపోరన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women  Journalists  Rajyavardhan Singh Rathore  

Other Articles