Uae scored 285 on zimbabwe

uae, Zimbabwe.world cup 2015, cricket updates

uae scored 285 on Zimbabwe: UAE scored 81 runs in the last 10 overs to post a challenging 285/7 vs Zimbabwe in their first World Cup match in 19 years. The task is cut out for Zimbabwe but like they showed against South Africa, they have the batting resources to get the job done.

కూనలు కాదు...285 పరుగులు చేసిన యూఏఈ

Posted: 02/19/2015 08:08 AM IST
Uae scored 285 on zimbabwe

ఈ సారి వరల్డ్ కప్ లో మాత్రం అనుకోనివి చాలా జరుగుతున్నాయి. చిన్న జట్లుగా వరల్డ్ కప్ లోకి వచ్చిన జట్లు అన్ని జట్లకు చమటలు పట్టిస్తున్నాయి. మొన్నటి వెస్టిండిస్, ఐర్లాండ్ మ్యాచ్ లో ఐర్లాండ్ ఆట అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వెస్టిండిస్ భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ఆటగాళ్లు ఛేదించిన సన్నివేశాన్ని అందరు ఆసక్తిగా గమనించారు. ఎంతో కాలంగా ఆడుతున్న ఆటగాళ్లు ఐర్లాండ్ ఆటకు ఫిదా అయ్యారంటే ఆశ్చర్యం కాదు. అదే తరహాలో చిన్న జట్టుగా ప్రవేశించిన యుఎఈ కూడా భారీగా స్కోర్ చేసి, మేమేం తక్కువ తిన్నమా అనిపిస్తోంది.

ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న షయమాన్ అన్వర్ అర్థ సెంచరీకి తోడు ఖుర్రమ్ ఖాన్ రాణించడంతో   యూఏఈ భారీ స్కోరు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 286 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షయమాన్ అన్వర్ 50 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 67 పరుగులుచేశాడు.  ఖుర్రమ్ ఖాన్ 45, కృష్ణ చంద్రన్ 34, పాటిల్ 32, బెరెన్జర్ 22, అమ్జదాద్ అలీ 7, ముస్తఫా 4 పరుగులు చేశారు. చివర్లో జావేద్, నవీద్ తమ బ్యాట్లకు  వేగం పెంచారు దాంతో కొంతసేపు బంతిని బౌండరీలు దాటించి, పరుగుల వర్షం కురిపించారు.  ఆడడంతో యూఏఈ భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ 8వ వికెట్ కు 32 బంతుల్లో 50 పరుగులు జోడించారు. జింబాబ్వే బౌలర్లలో ఛతారా 3 వికెట్లు పడగొట్టాడు. మిరె, విలియమ్స్ రెండేసి వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uae  Zimbabwe.world cup 2015  cricket updates  

Other Articles