In england vs newzeland match england lost two wickets

england vs newzeland match, world cup 2015,

in england vs newzeland match, england lost two wickets : newzeland trying to get hittrick in this match. england trying to win this match, the england team lost the last match with australia.

ప్రారంభంలొనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

Posted: 02/20/2015 08:03 AM IST
In england vs newzeland match england lost two wickets

ప్రపంచకప్ లో పూల్-ఏలో  జరుగుతున్న నేటి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ తలపడుతోంది. గత రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన కివీస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ లోనూ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మొదటి మ్యాచ్ లో శ్రీలంకను, రెండో మ్యాచ్ లో  స్కాట్లాండ్ ను న్యూజిలాండ్ ఓడించింది. దాంతో ఇంగ్లాండ్ ను ఎలా అయినా ఓడించి, హ్యాట్రిక్ ను సాధించాలని న్యుజిలాండ్ ఉవ్విల్లూరుతోంది. మరో పక్క మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతితో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్ తొలి విజయం సాధించాలని బరిలోకి దిగింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 36 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లు బెల్ 11, మొయిన్ అలీ 20 పరుగులకే వెనుదిరిగారు. వీరిద్దరినీ కివీస్ బౌలర్ సౌతీ క్లీన్ బౌల్డ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england vs newzeland match  world cup 2015  

Other Articles